ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా చేస్తామని.. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపైన ఢిల్లీలో BRS పార్టీ న్యాయపోరాటం చేస్తోంది. ఇందులో భాగంగానే రాజ్యాంగ నిపుణులతో సోమవారం BRS పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశమైంది.
అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. త్వరలోనే పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో పార్టీ తరపున కేసు వేయనున్నట్లు వెల్లడించారు. కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంలో స్పష్టత వస్తుందని రాజ్యాంగ నిపుణులు చెప్పారని కేటీఆర్ తెలిపారు.
కాగా, ఇప్పటికే BRS పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. BRS పార్టీ నుండి పోటీ చేసి గెలిచి.. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా చేస్తామని.. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.