Harish Rao: నిన్నటి దాడికి కారణం సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బ తినడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.


Published Sep 13, 2024 03:47:06 PM
postImages/2024-09-13/1726222626_kinghairsh.PNG

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బ తినడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శుక్రవారం కోకాపేట లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతి భద్రతలు అదుపు తప్పడానికి చేసిందంతా చేసి ఇపుడు హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. ఎమ్మెల్యే గాంధీకి బందోబస్తు ఇచ్చి దాడులు చేయించింది ఎవరు? రేవంత్ రెడ్డి, డీజీపీలు కాదా? నిన్న దాడులు ఎందుకు ఆపలేదని ఆయన ప్రశ్నించారు. పోలీసులను అడ్డంపెట్టుకొని మా ఎమ్మెల్యేపై దాడి చేసినపుడు రేవంత్ కు, డీజీపీకి లా అండ్ ఆర్డర్ గుర్తు రాలేదా అని నిలదీశారు. డీజీపీ ఎందుకు నిన్న చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. ఇది గాంధీ చేసిన దాడి కాదని, రేవంత్ రెడ్డి చేసిన దాడి అని హరీష్ రావు అన్నారు. బీఆర్‌ఎస్ నేతలను ఈరోజు హౌజ్ అరెస్ట్ చేశారని, నిన్న గాంధీని ఎందుకు హౌజ్ అరెస్టు చేయలేదని మండిపడ్డారు. నిన్నటి దాడికి కారణం సీఎం, డీపీజీ దే అని, చెయ్యాల్సింది చేసి సన్నాయి నొక్కులు నొక్కుతున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఖమ్మంలో తమ మీద దాడి చేస్తే పది రోజులైనా గుండాల మీద కేసులు పెట్టలేదని అన్నారు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే అరెస్టులు చేస్తరా? గంటల పాటు తప్పి మహబూబ్ నగర్ అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారని తెలిపారు. మమ్మల్ని అరెస్టులు చేస్తారు, హత్యాయత్నం చేసిన అరికపూడి గాంధీని, అనుచరులను బందోబస్తు మధ్య ఇంటికి పంపుతారా అని ప్రశ్నించారు. తమకు నీళ్లు కూడా ఇవ్వకుండా గంటల పాటు తిప్పి, దాడులు చేసిన వాళ్లను పోలీసు స్టేషన్‌లో కూర్చోబెట్టి బిర్యానీలు తినిపించి రాచ మర్యాదలు చేశారని హరీష్ రావు అన్నారు.  

newsline-whatsapp-channel
Tags : india-people mla brs cm-revanth-reddy congress-government harish-rao

Related Articles