Harish Rao: పాల్వాయి అంటే కేసీఆర్‌కి ఎంతో గౌరవం

మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి దంపతుల స్మారక సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు.


Published Sep 08, 2024 03:22:27 PM
postImages/2024-09-08/1725789147_palwai.PNG

న్యూస్ లైన్ డెస్క్: మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి దంపతుల స్మారక సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కాలంలో పాల్వాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఉద్యమమే అనేక సందర్భాల్లో కలిపేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అధికార పార్టీలో ఉంటూ బలమైన వాదన వినిపించిన నాయకుడు పాల్వాయి అన్నారు. నెహ్రూ కాలం నుంచి రాజీవ్ గాంధీ వరకు చివరి శ్వాస దాక కాంగ్రెస్ పార్టీ లాయాలిస్ట్‌గా పని చేశారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో రాజశేఖర్ రెడ్డికి భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటకి, అధికార పార్టీలో ఉండి కూడా తెలంగాణకు పూర్తి మద్దతు పలికారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యులుగా ప్రజలకు సేవ చేశారని అన్నారు. ఉద్యమకాలంలో చాలా ఆప్యాయంగా దగ్గర కూర్చోబెట్టుకొని వారి సూచనలు సలహాలు ఇచ్చేవారన్నారు. 2004లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుకు క్రియాశీలక పాత్ర పోషించిన నాయకుడు గోవర్ధన్ రెడ్డి అని హరీష్ రావు అన్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అంటే కేసీఆర్‌కి ఎంతో గౌరవం అని తెలిపారు. వారు చనిపోయినప్పుడు హిమాచల్ ప్రదేశ్ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో తెలంగాణకు తీసుకువచ్చి అధికార లాంఛనాలతో వారి అంత్యక్రియలు నిర్వహించారని ఆయన అన్నారు. వారి ఆశయాలను వారి కుటుంబ సభ్యులు కొనసాగించాలని హరీష్ రావు ఆశించారు. 

newsline-whatsapp-channel
Tags : kcr india-people mla brs congress harish-rao brs-cheif

Related Articles