KANNAYA : కన్నయ్య దర్శనానికి బృందావనం వెళ్తున్నారా ..అయితే ఇది తెలుసుకొండి !

అక్కడ రూమ్ లు ,భోజనం అంతా ఎక్కువ ధరలే. భారతీయుల కంటే ఫారనర్స్ ఎక్కువగా ఉంటుంటారు. నిజానికి బృందావనం లో తిరిగాలంటే వీధి వీధి తిరగాలి


Published Oct 02, 2024 05:30:00 PM
postImages/2024-10-02/1727870463_udupisrikrishnatemple.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బృందావనం దర్శనం ఎవరికి నచ్చదు. కన్నయ్య దర్శానానికి ఎవ్వరైనా ముగ్దులవ్వాల్సిందే. కాని బృందావన దర్శనం చాలా వరకు బడ్జెట్ తో ముడిపడి ఉంటుంది. అధిక ఖర్చులు కారణంగా చాలా మంది సింగిల్ డేలో వెళ్లివచ్చేలా చూసుకుంటారు. అక్కడ రూమ్ లు ,భోజనం అంతా ఎక్కువ ధరలే. భారతీయుల కంటే ఫారనర్స్ ఎక్కువగా ఉంటుంటారు. నిజానికి బృందావనం లో తిరిగాలంటే వీధి వీధి తిరగాలి అప్పుడు మనం కృష్ణుని అల్లరి ..కన్నయ్య చిలిపితనం గుర్తు చేసుకోవచ్చు. అయితే తక్కువ ఖర్చుతో ఎలా ఉండాలో తెలుసుకుందాం.


బడ్జెట్ కారణంగా అక్కడ ఉండడం, తినడం కూడా కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. నిజానికి ప్రతి దేవాలయంలోను అన్నదానం ఉంటుంది. అలాంటి కన్నయ్య ఉన్నచోట లేకపోవడం ఏంటి ..ఉంది కాని అందరికి తెలీదంతే. ఇఫ్పుడు తెలుసుకుందాం.బృందావన్‌లోని బాంకే బిహారీ ఆలయం, మధురలోని శ్రీ కృష్ణ జన్మ భూమి హిందువులకు విశ్వాస కేంద్రాలు. దీంతో పాటు బృందావనంలో నిర్మించిన గోవర్ధన్ పరిక్రమ, ప్రేమ మందిరం తదితరాలు ఆకర్షణీయంగా నిలిచాయి. ఇవన్నీ తిరగాలంటే దాదాపు 4 నాలుగు రోజులు బృందావనంలో ఉండాల్సిందే. రూమ్ లకు సత్రాలు వాడుకొని భోజనం వారు పెట్టిన అన్నదానం లో తింటే కన్నయ్య ని ఖర్చు లేకుండా చూసి రావచ్చు.


బృందావనంలో శ్రీ జగన్నాథ దేవాలయంలోని వంటగదిలో కేవలం 20 రూపాయలకే మంచి, రుచికరమైన ఆహారం అందిస్తారు. ఫస్ట్ టోకెన్ తీసుకుంటే చాలు. అక్కడ నుంచి ఫుడ్ ఫ్లేట్  తీసుకోవచ్చు. పెద్దగా రద్దీ ఉండదు. ఇక్కడ భోజనం చేశాక మీ ప్లేట్ మీరే క్లీన్ చెయ్యాలి. అక్కడకి వెళ్తే టిఫెన్ నుంచి రాత్రి భోజనం వరకు ఫ్రీ నే.
బృందావనంలోని చనా పువా ఆశ్రమంగా ప్రసిద్ధి చెందిన శ్రీ జీ రసోయిలో ఆహారం పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. ఇక్కడ అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు రోజంతా ఆహారం పొందుతారు. ఈ ప్రదేశం బాంకే బిహారీ ఆలయానికి కొద్ది దూరంలో ఉంది. గౌరీ గోపాల ఆశ్రమంలో కూడా ఆహారం ఉచితమే. వీటిని దృష్టిలో ఉంచుకొని వెళ్తే కన్నయ్యని బాగా దర్శనం చేసుకోవచ్చు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu krishna

Related Articles