TELECOM: BSNL బంపర్ ఆఫర్..తక్కువ ధర తో ఎక్కువ వ్యాలిడిటీ

రీజనబుల్ రీఛార్జ్ తో ఐదునెలల వ్యాలిడిటీ ప్లాన్ ను ప్రవేశపెట్టింది బీఎస్ ఎన్ ఎల్. 2026 వరకు 5జీ సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నది.


Published Aug 30, 2024 11:45:00 PM
postImages/2024-08-30/1725041901_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్; జయో , ఎయిర్ టెల్ ఎటు చూసినా రీఛార్జ్ రేట్లు మోతమోగిపోతున్నాయి. టెలికాం కంపెనీలైన ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలను పెంచిన తర్వాత మొబైల్ యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కు మారుతున్నారు. రీజనబుల్ రీఛార్జ్ తో ఐదునెలల వ్యాలిడిటీ ప్లాన్ ను ప్రవేశపెట్టింది బీఎస్ ఎన్ ఎల్. 2026 వరకు 5జీ సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నది. ఈ లోపే కస్టమర్లకు అట్రాక్ట్ చెయ్యడానికి బీఎస్ ఎన్ ఎల్ ఈ ప్లాన్ ను ప్లాన్ చేసింది.


ఈ ప్లాన్ ధర కేవలం రూ. 397. ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే 5 నెలల వ్యాలిడిటీ పొందొచ్చు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 30 రోజుల పాటు అన్ లిమిటెడ్ ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. 150 రోజుల పాటు ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఫస్ట్ నెల మీరు కాల్స్ చేసుకోవచ్చు, మెసేజ్ , డేటా అన్ని ఉంటాయి. తర్వాత నెలలు మాత్రం జస్ట్ ఇన్ కమింగ్ కాల్స్ మాత్రమే వస్తాయి.


ఇయర్లీ వన్స్ ప్లాన్ రీఛార్జ్ చెయ్యాలంటే ..జస్ట్ రూ. 2999గా ఉంది. ఈ రీచార్జ్ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే సంవత్సరం పొడవునా అన్ లిమిటెడ్ కాల్స్, ప్రతి రోజు 3 జీబీ హైస్పీడ్ డేటా పొందొచ్చు. ఇందులో కూడా రోజుకు 100 టెక్స్ట్ మెసేజ్ లు వస్తాయి. మూవీస్ , పబ్ జీ లాంటి ఆడేవారికి ఇది బెస్ట్ ప్లాన్.

newsline-whatsapp-channel
Tags : jio bsnl recharge yearly-package 5g

Related Articles