జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈ హీరో కూడా ఒకరు. ఆర్ఆర్ఆర్ మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈ హీరో కూడా ఒకరు. ఆర్ఆర్ఆర్ మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే దేవర సినిమా షూటింగ్స్ లో ఉండగానే అటు బాలీవుడ్లో వార్-2 మూవీలో కూడా చేస్తున్నారు.
అంతేకాకుండా తాజాగా శుక్రవారం రోజు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోయే సినిమాకి సంబంధించి పూజ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు.మరి ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ తన చేతికి పెట్టుకున్న లగ్జరీ వాచ్ ఖరీదు ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్,ప్రశాంత్ నిల్ కాంబినేషన్లో రాబోయే సినిమాకి డ్రాగన్ అనే పేరును పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
కానీ ఈ పేరు ఇంకా చర్చల దశలోనే ఉంది. అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా స్టార్ట్ అవుతోంది. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోయే సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలలో ఎన్టీఆర్ తన చేతికి పెట్టుకున్న వాచ్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆ వాచ్ ధర అమెరికా ధర ప్రకారం అక్షరాల మూడు లక్షల డాలర్లు..
అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపుగా రెండున్నర కోట్లు అన్నమాట. ఇక ఒక వాచ్ కి రెండున్నర కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఈ వాచ్ కి పెట్టే ధరతో బలగం వంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించవచ్చు అంటున్నారు ఈ విషయం తెలిసిన కొంతమంది సినీ జనాలు.అయితే 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోకి రెండు కోట్లు పెద్ద విషయం ఏమీ కాదు