తాజగా వాహనాలను పార్క్ చేసేవారు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని హైదరాబాద్ మెట్రో తెలిపింది. వాహనాల రకాలు, వాటిని అక్కడ ఉంచే సమయాన్ని బట్టి ధరలు నిర్ణయించారు.
న్యూస్ లైన్ డెస్క్: నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర వాహనాలను పార్క్ చేసే వారికి భారీ షాక్ తిగిలింది. గతంలో అక్కడ వాహనాలను పార్క్ చేసే వారికి ఛార్జ్ చేసే వారు కాదు. దీంతో దూరప్రయాణాలు వెళ్లేవారు రోజుల తరబడి వాహనాలను అక్కడ ఉంచేవారు. అయితే, తాజగా వాహనాలను పార్క్ చేసేవారు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని హైదరాబాద్ మెట్రో తెలిపింది. వాహనాల రకాలు, వాటిని అక్కడ ఉంచే సమయాన్ని బట్టి ధరలు నిర్ణయించారు.
దీని ప్రకారం బైకులను రెండు గంటల పాటు పార్క్ చేస్తే.. రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. 8 గంటల వరకు పార్క్ చేస్తే రూ.25.. 12 గంటల వరకు అయితే రూ.40 చెల్లించాల్సి ఉంటుంది. కార్లను రెండు గంటలు పార్క్ చేస్తే రూ.30 చెల్లించాలి. 8 గంటల వరకు రూ.75.. 12 గంటల వరకు రూ.120 చొప్పున ధరలు చెల్లించాలని హైదరాబాద్ మెట్రో యాజమాన్యం సూచించింది. అయితే, ముందుగా డబ్బు చెల్లించిన తరువాతే వాహనాలను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
ఇదే కాకుండా, ప్రతిరోజూ పార్కింగ్ చేసుకోవాలి అనుకునే వారికి పాస్ కూడా అందుబాటులో ఉండనుంది. ఇది తీసుకునే వారికి 40 శాతం డిస్కౌంట్ కూడా లభించనుంది.