జూబ్లీహిల్స్ నివాసంలో రీజినల్ రింగ్ రోడ్ (దక్షిణ భాగం) అలైన్‌మెంట్ పై అధికారులతో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
న్యూస్ లైన్ డెస్క్: జూబ్లీహిల్స్ నివాసంలో రీజినల్ రింగ్ రోడ్ (దక్షిణ భాగం) అలైన్‌మెంట్ పై అధికారులతో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య అనుసంధానానికి అనువుగా రహదారుల ప్రణాళికలు ఉండాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశించారు. ప్రధాన రహదారులకు అనుసంధానం చేసే ప్రదేశాలను ముందుగానే గుర్తించి నిరంతరం సాఫీగా ప్రయాణాలు సాగేందుకు వీలుగా నిర్మాణాలు ఉండాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.