కమిటీ కుర్రోళ్లు ఆడియన్స్ కు నచ్చింది. నిర్మాతగా పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై వరుసగా సినిమాలు నిర్మిస్తుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మొత్తానికి నిహారిక ప్రొడ్యూసర్ అయిపోయింది. తనకంటు ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఎదరుచూస్తున్న నిహారికకు ..మంచి వెల్ కమ్ దక్కింది. కమిటీ కుర్రోళ్లు ఆడియన్స్ కు నచ్చింది. నిర్మాతగా పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై వరుసగా సినిమాలు నిర్మిస్తుంది. అసలు సినిమా కథేంటో...నిర్మాత, డైరక్టర్, కెమరా డీటైల్స్ చూసేద్దాం.
నటీనటులు:సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా,సాయికుమార్, మణికంఠ పరశు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరణ్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, తేజస్వీ రావు, షణ్ముకి, రాధ్య, టీనా శ్రావ్య, విశిక, తదితరులు
ఎడిటింగ్: అన్వర్ అలీ
సినిమాటోగ్రఫీ: ఎడిరోలు రాజు
సంగీతం: అనుదీప్ దేవ్
నిర్మాతలు: నిహారిక, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక
దర్శకత్వం: యదు వంశీ
ఇక కథలోకి వస్తే.....పక్కా గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా ఇది. లోని ఓ కుగ్రామంలో పుష్కరానికి అంటే 12 యేళ్లకు ఒకసారి జాతర జరగుతూ ఉంటుంది. అయితే.. ఈ సారి జాతర తర్వాత పది రోజులకు ఊర్లో ఎన్నికలు ఉంటాయి. జాతర జరగాలంటే ప్రత్యేకంగా ఒక ఫ్యామిలీచేతుల మీద జరుగుతుంది. కాని ఆ ఫ్యామిలీ ఊరి వదిలి వెళ్లిపోతారు.
అసలు ఆ ఫ్యామిలీ తిరిగి ఊర్లోకి తీసుకురావడం అనేది..కొంతమంది కుర్రాళ్లు ఒప్పుకుంటారు. ఈ సారి ఎన్నికల్లో కమిటీ కుర్రాళ్లలో ఒకడైన శివ ఊరి సర్పంచ్ పదవి కోసం పోటీలో దిగుతాడు. ఈ నేపథ్యంలో స్నేహితుల మధ్య కులాలు, రిజర్వేషన్లు చిచ్చు రగులుతుంది. ఈ నేపథ్యంలో కులాల చిచ్చు మధ్య నలిగిన ఈ కుర్రాళ్లు ఎలా ఆ ఉచ్చు నుంచి ఎలా బయటపడ్డారు. అనేది స్టోరీ..
‘రంగస్థలం’ సినిమా తర్వాత తెలుగులో 80, 90ల కాలం నాటి సినిమాలు తెరకెక్కించడానికి దర్శకులు ముందుకు వస్తున్నారు. కాస్త కమిటీ కుర్రాళ్లకు...నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరిటీస్ " లో ఆ ఫ్రెండ్షిప్ గాలి తగులుతుంది . తెరపై చక్కగా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు యదు వంశీ మంచి మార్కులే కొట్టేసాడు. మొబైల్స్ లేని కాలంలో మనుషుల మధ్య స్నేహాన్ని.. అప్పట్లో కుర్రాళ్లు హాలీవుడ్ సినిమాల్లోనీ సీన్స్ కోసం వీడియో క్యాసెట్లు, సీడీల కోసం ఎగబటడం వంటివి ఆనాటి కాలానికి ప్రేక్షకులను తీసుకెళ్లాడు. సినిమా చాలా కనెక్ట్ అవుతుంది.
మొత్తంగా దర్శకుడు తాను రాసుకున్న కథను తెరపై చక్కగా ప్రెజెంట్ చేసాడు. ప్రస్తుతం సమాజాంలో కులాల పేరుతో రాజకీయ పార్టీలు చేస్తోన్న రచ్చను గుర్తుకు తెస్తుంది. దర్శకుడు ఈ స్టోరీని ..రా అండ్ రస్టిక్ గా కూడా తీసి ఉండవచ్చు. కాని సినిమా కు కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ..సినిమాటోగ్రఫీ కూడా ఆ నాటి కాలాన్ని గుర్తుకు తెస్తుంది. కాస్త సెకాండాఫ్ కాస్త ల్యాగ్ చేసినట్టుగా అనిపించినా అనుదీప్ ఆర్ ఆర్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది.
కొత్త కుర్రాళ్లు ..సినిమా యాక్టింగ్ ఎలాగా అనుకున్నారంతా..కాని కొత్త కుర్రాళ్లు అదరగొట్టేశారు. పక్కింటి తెలిసిన కుర్రాళ్లు ఎలా చేస్తారో అలానే ఈ సినిమాలో వీళ్ల యాక్టింగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. వీళ్లకు కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటే మంచి నటీనటులు అవుతారు. సాయి కుమార్ తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. టోటల్ గా సినిమా సూపర్...ఫ్యామిలీ ఎంటర్ టైనర్.