deepika: ఏం సోకులే తల్లి...దీపిక పై ట్రోల్ చేస్తున్న నెటిజన్లు ? 2024-06-20 21:30:36

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అసలు అమ్మ అవ్వడం ఎంత అదృష్టం ..ఇన్నాళ్లకు ఆ అదృష్టం దీపికకు వరిస్తే ...హై హీల్స్ వేసుకొచ్చి సోకులకు పోతుందంటున్నారు నెటిజన్లు. ఎందుకు ఈ ట్రోలింగ్ ( trolling) అంటే రీసెంట్ గా ఆమె... కల్కి ( kalki) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా హాజరయ్యారు. అయితే.. ఆ సమయంలో ఆమె.. హై హీల్స్ ధరించారు. ఈవిడకు ...అమితాబ్( amithab)  ..ప్రభాస్( prabhas)  ..రానా ( rana) స్టేజ్ ఎక్కడానికి దిగడానికి సాయం కూడా చేశారు. ఈ పిక్స్ లో దీపికా హీల్స్ వేసుకొని కనిపించింది. 


చాలా మంది.. నెటిజన్లు.. ఆ ఫోటోలు చూసి.. దీపికాను విమర్శించారు. కడుపుతో ఉండి హీల్స్ వేసుకుంటావా..  అంటూ విమర్శించారు.  హీల్స్ వేసుకుంటే అది కూడా ప్రెగ్నెన్సీ( pregnency)  టైంలో వేసుకోవడం వల్ల ప్రీ మెచ్యుర్డ్ డెలివరీ అవుతుందని చెప్పడమే కాకుండా..బేబీ పొజిషన్ ఈ హీల్స్ కారణంగా మారుతుందని అంటున్నారు.


సాధారణంగా అమ్మాయిలకు హై హీల్స్ ( high heels)  వేసుకోవడం బాగా నచ్చుతుంది. కానీ.. హైహీల్స్ నడుము నొప్పి త్వరగా తీవ్రమయ్యేలా చేస్తుంది. గర్భధారణ సమయంలో, ఇది దిగువ వీపు, కాళ్ళలోని స్నాయువులతో కూడా ఇబ్బందులను సృష్టిస్తుంది.
గర్భం దాల్చిన సమయంలో.. ఎక్కువగా పాదాలు స్వెల్లింగ్ వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో.. ఈ హీల్స్ వేసుకోవడం వల్ల.. మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందట. ఇలా పాయింట్ హీల్స్ తో బిడ్డను రిస్క్ పెట్టుకుంటున్నావంటు తెగ కమెంట్లు పెడుతున్నారు.