అరవింద్ కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ ఎమ్మల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది
న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామలు చోటు చేసుకుంది. లిక్కర్ స్యాం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ ఎమ్మల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ఇద్దరు నేతలను మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట హాజరుపరిచారు. ఈ క్రమంలో వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు సెప్టెంబర్ 2 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం పాలసీ కేసుకు సంబంధించిన కేసులో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ సీబీఐ కేసులో మాత్రం కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. ప్రస్తుతం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలు ఉన్నారు.