DEVARA : `దేవర` మూవీ లో ఇవే మైనస్‌ లు ..అవి ఏంటంటే?

ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం మరో విశేషం. సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు . స్టార్ టెక్నిషియన్స్ ఈ మూవీ కి పనిచేశారు.


Published Sep 27, 2024 11:13:00 AM
postImages/2024-09-27/1727415944_hq720.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తున్నాయి. సినిమా ఆల్ మోస్ట్ జనాలకు నచ్చేసంది. కొరటాల శివ డైరక్షన్ లో విజువల్ యాక్షన్ ఎంటర్ టైనర్ దేవర సూపర్ అంటున్నారు ఫ్యాన్స్.బాలీవుడ్‌ హీరోయిన్‌, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం మరో విశేషం. సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు . స్టార్ టెక్నిషియన్స్ ఈ మూవీ కి పనిచేశారు.


సినిమా రిలీజ్ కు ముందే రెండు మిలియన్ల ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది.ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఏకంగా ఎనిమిదిన్నర లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. ట్రైలర్ టాక్ చూసి సినిమా కలక్షన్ల మీద డౌట్ వచ్చింది. కాని టాక్ చూస్తే ఫస్ట్ రోజే భారీ కలక్షన్లు వచ్చేలా ఉన్నాయంటున్నారు సినీ వర్గాలు.సాధారణంగా ఓవర్సీస్‌ క్రిటిక్స్ గా చెలామణి అవుతూ, వివాదాస్పద పోస్ట్ లతో వార్తల్లో నిలిచే ఉమైర్‌ సందు పెట్టిన పోస్ట్ వైరల్‌ అవుతుంది.


ఇందులో ఎన్టీఆర్‌ నటనపై ప్రశంసలు కురిపించాడు ఉమైర్‌ సందు. తారక్ ను బెస్ట్ యాక్టర్ అని ప్రశంసలు కురిపించారు. సినిమాకు తారక్ ఓ ఎలివేషన్ అయితే సైఫ్ అలీఖాన్ ఓ అధ్భుతమని తెలిపారు. అదే సమయంలో జాన్వీ కపూర్‌ పాత్ర సెట్‌ కాలేదని, ఇరికించినట్టు ఉందట. సినిమా కథ పెద్దగా లేదని, మామూలు స్టోరీనే కానీ, ఎంగేజింగ్‌గా ఉందన్న తెలిపారు. స్క్రీన్‌ ప్లే రేసిగా ఉంటుందట. మ్యూజిక్‌ పెద్ద అసెట్‌ అని, బీజీఎం సూపర్ డూపర్ అని కామెంట్ చేశారు. ఓవరాల్‌గా `దేవర` పైసా వసూల్‌ మూవీ అని, బిగ్‌ స్క్రీన్‌పై సినిమా సూపర్ అని కామెంట్ చేశారు. ఉమైర్ సందు పోస్టులు వైరల్ అవుతున్నాయి. సినిమా కథ కాస్త ట్రైలర్ లో చెప్పేయడం కాస్త మైనస్ అవ్వచ్చంటు కామెంట్ చేశాడు. అంతేకాదు ఈ సినిమా లో జాన్వీ కి పెద్దగా స్కోప్ లేదు. జస్ట్ గ్లామర్ షో ...ఈ మాత్రం దానికి జాన్వీ నే ఉండక్కర్లేదనేది సార్ అభిప్రాయం. ఎన్ని కామెంట్లు చేసినా సినిమా మాత్రం సూపర్ డూపర్ అని కితాబులిచ్చాడు.
 

newsline-whatsapp-channel
Tags : jr-ntr movie-news devara super-hit koratala-shiva

Related Articles