అనిరుధ్ బాణీలు కూడా జనంలోకి బాగానే పోయాయి. అలాంటి ఈ సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. అసలు సినిమా ఏంటో రివ్యూ చెప్పుకుందాం వచ్చేయండి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో " దేవర " మూవీ జనాల్లో సూపర్ డూపర్ టాక్ తో నడుస్తుంది. ఫస్ట్ కొరటాల శివ..ఎన్టీఆర్ కాంభినేషన్ లో వచ్చిన సినిమా జనతాగ్యారేజ్ సినిమా హిట్టు కావడంతో ఈ సినిమా పై అంనాలు పెరిగాయి. అనిరుధ్ బాణీలు కూడా జనంలోకి బాగానే పోయాయి. అలాంటి ఈ సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. అసలు సినిమా ఏంటో రివ్యూ చెప్పుకుందాం వచ్చేయండి.
*కధ..
అది ఆంధ్ర - తమిళనాడు ప్రాంతం .. ఎర్ర సముద్రతీరం. అక్కడి కొండలపై చాలా కాలంగా కొంతమంది ప్రజలు నివసిస్తూ ఉంటారు. నాలుగు ఊళ్లుగా ఏర్పడిన ప్రజలు, చేపల వేటపై ఆధారపడి తమ జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ల నాయకుడుగా ఎన్టీఆర్ ( దేవర) ఉంటాడు. అయితే అతనంటే పడని భైరా క్యారక్టర్ మరో వర్గానికి నాయకుడిగా తయారవుతూ ఉంటాడు.
ఆ నాలుగు గ్రామాల మధ్య ప్రతి ఏడాది 'ఆయుధపూజ' రోజున కుస్తీ పోటీ ఉంటుంది. ఈ పోటీలో ప్రతి గ్రామం నుంచి ఇద్దరేసి పాల్గొంటారు. ఎవరు గెలిస్తే వారి గ్రామానికి ఆయుధాలు వస్తాయి. అలా ఆయుధాలు గ్రామానికి రావడం వల్ల వాళ్ల ఊరుకు మంచి జరుగుతుందనేది వారి నమ్మకం. చాలా సంవత్సరాలుగా దేవరనే గెలుస్తాడు...దేవర పై భైరాకి ద్వేషం పెరుగుతుంది.
సముద్ర నౌకలలో రవాణా అవుతున్న సరుకును దొంగిలించి తమకి చేరవేయమని దేవర బృందంతో మురుగన్ డీల్ కుదుర్చుకుంటాడు. చాలా డబ్బు వస్తుందన్న ఆలోచనలో భైరా తో చాలా మంది కుర్రాళ్లు చేరి సముద్రదొంగలు అవుతారు. అయితే ఆ దొంగిలిస్తున్నవి వెపన్స్ అని అవి బయటవారికి ..వారికి చాలా ప్రమాదకరమని దేవరకు తెలుస్తుంది. అప్పటి నుంచి దేవర మారిపోతాడు. ఇకపై తాము ఆయుధాల దొంగతనం చేయవద్దనీ, చేపల వేటతో వచ్చిన దానితో సంతృప్తి పడదామని తన మనుషులతో చెబుతాడు. కాని భైరా ఒప్పుకోడు. సో దేవరను చంపేయాలనుకుంటారు.అందుకోసం అతనికి అత్యంత సన్నిహితుడైన రాయప్ప (శ్రీకాంత్)ను ఉపయోగించుకుంటారు. ఆ రోజు రాత్రి సముద్రతీరానికి వెళ్లిన దేవర, ఏమైపోయాడనేది ఎవరికీ తెలియదు. సముద్రంపై కావాలిగా ఉంటానంటూ అతను రాసిన నెత్తురు రాతలు మాత్రమే అక్కడి ప్రజలు చూస్తారు. అలా పుష్కరకాలం గడిచాక దేవర కొడుకు ఎదుగుతాడు ..అతనిని అదే తాండాలో ఉన్న తంగం ప్రేమిస్తుంది.'వరద' పిరికివాడు కావడం వలన, అతని గురించి భైరా పెద్దగా పట్టించుకోడు. ఇంకా దేవరను తిరిగి రప్పించాలని భైరా ప్లాన్ చేస్తుంటాడు. ఏ ప్లాన్స్ వేశాడు అనేదే స్టోరీ.
కొరటాల శివ రాసుకున్న కథ ఇది. ఫస్టాఫ్ అంతా 'దేవర' పాత్ర .. సెకండాఫ్ అంత 'వరద' పాత్ర తెరపై కనిపిస్తాయి. ఇటు గూడెం .. అటు సముద్ర తీరం .. కథ మొదలైన 20 నిమిషాలకు దేవర పాత్ర ఎంట్రీ ఇస్తుంది. నౌకలోని సరుకుని దొంగిలించే పెద్ద ఆపరేషన్ సీన్ ఇది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కి సంబంధించిన ఈ సీన్ చప్పగా ముగియడంతో ప్రేక్షకులు డీలాపడతారు.
కొన్ని పాయింట్లు నమ్మేవిగా లేవు..
* ఎన్టీఆర్ 12 యేళ్లు సముద్రంలో ఎలా ఉన్నాడు.
*ఆయుధాల కోసం ఎన్టీఆర్ ఎందుకు తమ ఊరివారిని రానివ్వడు
*వరద పిరికివాడంటే భైరా ఎలా నమ్మాడు.
* అసలు జాన్వీ ఎందుకు పెట్టారు..గ్లామర్ కా..హీరోయిన్ ఉండాలని పెట్టారా
*ప్రకాశ్ రాజ్ .. శ్రీకాంత్ .. షైన్ టామ్ చాకో పాత్రలకి ప్రాధాన్యత లేదు.
* యాక్షన్ సన్నివేశాలలో భారీతనం ఉంది .. కానీ వాటిని డిఫరెంట్ గా కంపోజ్ చేయలేదు.
*నైట్ ఎఫెక్ట్ కి సంబంధించిన సీన్స్ ను .. ఉన్న ఒక్క డ్యూయెట్ ను అందంగా చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది.
*'చుట్టమల్లే .. 'బాణీ బాగుంది. బీట్ బాగుంది కాని ఎందుకో సాహిత్యం అంతగా కుదర్లేదనిపిస్తుంది.
*గుర్తుండిపోయే డైలాగ్స్ ఒకటి రెండు మాత్రమే వినిపిస్తాయి
* ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడం, భైరా క్యారక్టర్ లో తీసుకున్న కేర్ ..శ్రీకాంత్ లాంటి స్ట్రాంగ్ పర్సన్స్ క్యారక్టర్లు డిజైన్ చేయలేకపోయారు డైరక్టర్.
*ఎక్కువ పాత్రల పేర్లు చెబుతూ కన్ఫ్యూజ్ చేయడం .. లాజిక్ లేకపోవడం .. యాక్షన్ సీన్స్ లో మేజిక్ కనిపించకపోవడం .. జాన్వీ తెరపై మెరిసింది కాసేపే కావడం. ఇవన్నీ మైనస్లే అయినా సినిమా కలక్షన్లు వచ్చేస్తుంది. డబ్బులు వచ్చేస్తాయి. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. సినిమా ఓకే ఓకే అనే చెప్పాలి.