నటి నమ్రత తండ్రి స్టార్ క్రికెటర్ అని తెలుసా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో మహేష్ బాబు అంటే ఎంత క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఈయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి మహేష్ బాబు ప్రస్తుతం పాన్


Published Sep 28, 2024 07:53:42 PM
postImages/2024-09-28/1727533422_namrataha.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో మహేష్ బాబు అంటే ఎంత క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఈయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి మహేష్ బాబు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈయన సినిమాల విషయం పక్కన పెడితే మహేష్ బాబు నమ్రత  వంశీ సినిమాలో హీరో హీరోయిన్లుగా చేశారు. అలా వీరిద్దరి మధ్య పుట్టినటువంటి ప్రేమ ఆ తర్వాత  పెళ్లి వరకు దారి తీసింది. అలా చివరికి ఇద్దరు కలిసి  పెళ్లి కూడా చేసుకున్నారు.

వివాహం అనంతరం నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పింది. అయితే వీరి వివాహానికి మొదట్లో సూపర్ స్టార్ కృష్ణ నిరాకరించారట. కానీ నమ్రత, మహేష్ బాబు  ఎలాగోల కృష్ణను ఒప్పించి పెళ్లి చేసుకుని చివరికి ఆయన ముందే హ్యాపీగా బ్రతికారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ అర్థం చేసుకొని  నా కొడుక్కు ఇంతకంటే మంచి అమ్మాయిని నేను తీసుకురాలేనని ఆలోచన చేసుకొని సైలెంట్ అయిపోయారట. ఇక ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు  పెళ్లి చేసుకున్నటువంటి నమ్రత తండ్రి ఒక స్టార్ క్రికెటర్ అని చాలామందికి తెలియదు.

మరి ఆయన ఎవరు వివరాలు చూద్దాం..నమ్రత మహారాష్ట్రకు చెందిన మహిళ. ఆమె తండ్రి నితిన్ శిరోద్కర్. అయితే ఈయన 1977 సమయంలో ఒక క్రికెటర్ గా రాణించారట.  ఈయన ముంబైలో దేశవాలి క్రికెట్ ఆడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారట. సునీల్ గవాస్కర్ లాంటి స్టార్ ఆటగాళ్లతో కూడా ఈయన ఆడేవారట. ఈయన కేవలం బ్యాటింగ్ చేయడమే కాకుండా ఆల్రౌండర్ అని కూడా తెలుస్తోంది. మరి ఆయన ఎవరో మీరు కూడా చూసేయండి..

https://www.instagram.com/p/CLf8bPCjePR/?igsh=MWtiam8xa3VnNGphZQ==

newsline-whatsapp-channel
Tags : newslinetelugu mahesh-babu namrata sithara nithin-sidodkar

Related Articles