HARSHA SAI : అరే ఏంట్రా ఇది...ఈ వాయిస్ హర్షా సాయిదే కదా ..ఆడియో లీక్ !

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ బాధితురాలికి హర్ష సాయికి మధ్య వివాదం నెలకొంది. అక్కడ తేడా కొట్టే బాధితురాలు మీడియా వరకు వచ్చిందనే వాదనలు కూడా ఉన్నాయి.


Published Sep 28, 2024 06:08:00 PM
postImages/2024-09-28/1727527403_HarshaSai8352c11cecVjpg799x4144g.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ మధ్య హర్షా సాయి సూపర్ ఫేమస్ అయిపోతున్నాడు. రీసెంట్ గా బెట్టింగ్ యాప్స్ పై షాకింగ్ కామెంట్లు చేసిన హర్షాసాయి...ఇప్పుడు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ బాధితురాలికి హర్ష సాయికి మధ్య వివాదం నెలకొంది. అక్కడ తేడా కొట్టే బాధితురాలు మీడియా వరకు వచ్చిందనే వాదనలు కూడా ఉన్నాయి.


వీరిద్దరు మాట్లాడుకుంటున్న ఓ ఆడియో లీక్ అయింది. కో ప్రొడ్యూసర్, బాధితురాలు అన్నట్లు ఇందులో బయటపడింది. దీంతో ఆ ప్రభావం మెగా సినిమాపై కూడా పడుతుంది అని చెప్పారు బాధితురాలు… బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఆపేయాలని బాధితురాలికి హర్ష సాయికి మధ్య వివాదం నెలకొందట. ఇక్కడ ఇద్దరికి డీల్ కుదరక గొడవ మొదలయ్యిందని అంటున్నారు.


లోటస్ 360 అనే బెట్టింగ్ యాప్ ను నిషేధించింది సెంట్రల్ గవర్నమెంట్. కానీ నిషేధించిన బెట్టింగ్ యాప్ లింక్ తన వీడియోలో పెడితే 10 కోట్లయినా ఇస్తారు అని ఆడియోలో చెప్తున్నారు హర్ష సాయి. అంతేకాదు ఆ అమ్మాయి కాస్త పర్సనల్ గా మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఈ ఆడియోలో హర్షసాయి కంటే ఎక్కవగా బాధితురాలే మాట్లాడింది. తనంటే ఇష్టమనే విషయాన్ని తనే ముందు వ్యక్తపరిచింది. దీని వల్ల ఈ కేసు ఆ అమ్మాయి ఎందుకుపెట్టిందనే అనుమానం కూడా ఉంది. ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఏంటో అంటున్నారు నెటిజన్లు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news bigboss4

Related Articles