Rakul:6 నెలల్లో రకుల్ దంపతుల విడాకులు..వేణుస్వామి సంచలన కామెంట్స్.!

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె పేరు తెలియని వారు ఉండరు.  తన అందచెందాలతో అద్భుతంగా నటిస్తూ ఎంతో గుర్తింపు సంపాదించింది. అలాంటి రకుల్ సినిమాల పరంగా అద్భుతంగా దూసుకుపోతున్న కానీ తన సొంత లైఫ్ లో ఫెయిల్ అవుతుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.  కాని ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి కూడా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.  ఆమె చేసుకున్న వివాహం అంతగా కలిసి రాదని ఎన్నో సమస్యల బారిన పడుతుందని,  తాను ముందే చెప్పినట్లుగానే ఆమె వివాహ జీవితం సమస్యల వలయంలో చిక్కుకుందని అంటున్నారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-21/1721547002_bhag.jpg

న్యూస్ లైన్ డెస్క్: రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె పేరు తెలియని వారు ఉండరు.  తన అందచెందాలతో అద్భుతంగా నటిస్తూ ఎంతో గుర్తింపు సంపాదించింది. అలాంటి రకుల్ సినిమాల పరంగా అద్భుతంగా దూసుకుపోతున్న కానీ తన సొంత లైఫ్ లో ఫెయిల్ అవుతుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.  కాని ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి కూడా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.  ఆమె చేసుకున్న వివాహం అంతగా కలిసి రాదని ఎన్నో సమస్యల బారిన పడుతుందని,  తాను ముందే చెప్పినట్లుగానే ఆమె వివాహ జీవితం సమస్యల వలయంలో చిక్కుకుందని అంటున్నారు.

తన భర్త జాకీ బాగ్నానికి బాలీవుడ్ లో పూజ ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో ఒక నిర్మాణ సంస్థ ఉందని, ఈ నిర్మాణ సంస్థలో అనేక సినిమాలు తెరకేక్కాయని, కానీ ఇటీవల వచ్చినటువంటి బడే మియా చోటే మియా సినిమా భారీగా డిజాస్టర్ కావడంతో నష్టాలు వచ్చాయని అన్నారు.  రకుల్ ను పెళ్లి చేసుకోవడం వల్లే ఆయనకు నష్టాలు వచ్చాయని, దాదాపుగా రూ:500 కోట్లకు పైగా నష్టపోయినట్లు చెప్పుకొచ్చారు. పెళ్లి తర్వాత ఇలా జరుగుతుందని నేను రకుల్ కు ముందే చెప్పానని నేను చెప్పినట్లుగానే ఆమె జీవితంలో అనేక అవాంతరాలు  వస్తున్నాయని ఆరు నెలల్లో విడాకులు కూడా తీసుకుంటుందని వేణు స్వామి బాంబు పేల్చారు.

ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే వేణు స్వామి కేవలం రకుల్ గురించే కాకుండా గతంలో పలువురు సెలబ్రిటీల గురించి కూడా చెప్పి ఫేమస్ అయ్యారు. ఆయన చెప్పినట్లుగానే నాగచైతన్య సమంత కూడా విడాకుల ద్వారా విడిపోతారని చెప్పారు. ఏపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పారు, కానీ అనూహ్యంగా టిడిపి గెలవడంతో వేణు స్వామి  కొన్నాళ్లపాటు జతకాలు చెప్పడం ఆపేసి మళ్ళీ మొదలుపెట్టారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu divorce venuswamy rakul-preet-singh jocky-bagnani

Related Articles