varmahalakshmi : మహాలక్ష్మీ దేవి పూజలకు ..ఈ తప్పులు అస్సలు చెయ్యకూడదని తెలుసా ?

శ్రావణ మాసం వేరు..ప్రతి ఇళ్లు పచ్చటి తోరణాలతో..పసుపు, పూలు...సనాతన ధర్మ విశేషం ప్రతి ఇంట్లో కనిపిస్తుంది.


Published Aug 14, 2024 09:14:00 AM
postImages/2024-08-14/1723607131_varamahalakshmipuja2012.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆడవారు ..శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తారు. ప్రతి పండుగ వేరు..శ్రావణ మాసం వేరు..ప్రతి ఇళ్లు పచ్చటి తోరణాలతో..పసుపు, పూలు...సనాతన ధర్మ విశేషం ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. అయితే ఈ మధ్య మాత్రం శ్రావణ మాస పూజలు కాస్త రూపు మార్చుకున్నాయి. ఎక్కువ డెకరేషన్ కు ప్రాధాన్యతనిస్తూ ...పూజలు పురాణాల్లో చెప్పినట్లు కాకుండా తమకు నచ్చినట్లు చేస్తున్నారు. కలశ స్థాపన చేశాక చెయ్యకూడని ఎన్నో పనులు పండితుల సమక్షంలోనే చేసేస్తున్నారు. అందులో చెయ్యకూడనివి ఏంటో చెప్తాం చూడండి.


1. పూజలో ప్లాస్టిక్ పూలు వాడకండి. డెకరేషన్ కోసం వాడుకుంటే వాల్ డెకరేట్ చేసుకొండి కాని అమ్మవారి రూపులో మాత్రం ప్లాస్టిక్ వాడకండి. మీరు పెట్టే సాధారణ పూలకు ...జగన్మాత మనసు పరవసించిపోతుంది.అసలు సుగంధ ధ్రవ్యాల వాసనకే అమ్మ తిష్టవేసుకు కూర్చుంటుందట.


2 . అప్పు చేసి పూజ చెయ్యకండి. శ్రావణ మాసం చాలా వరకు బంగారం,  చీరలు ..ప్రసాదాలు ఖర్చులతో కూడుకున్నదే. కాని యధాశక్తి  పూజ చేసుకొండి. జనాల కోసం ఆలోచించకండి.


3. తాంబూలం లో ...జాకెట్ ముక్కలు కంపల్సరీ కాదు. మీరు మీ ఇంట్లో అమ్మవారికి మీ శక్తి కొలది...ఏడాదికి ఓ సారి మీ ఇంటి ఆడపడుచు మీ ఇంటికి వస్తే ఎలా గౌరవంగా ...హుందాగా  చీర సారెలు పెట్టి పంపుతారో అలా చేసుకొండి. మీ వల్ల కానపుడు మాత్రం అప్పుల జోలికి పోకండి. 


4. ఇప్పుడు తాంబూలానికి రిటర్న్ గిఫ్ట్స్ చాలా కామన్ గా ఇస్తున్నారు. ఇవి కూడా అవసరం లేదు. ఎక్కడా ...రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వమని చెప్పలేదు. మీకు డబ్బులుండి చేసుకుంటే చేసుకొండి కాని అది తాంబూల వస్తువు కాదు.


5. వ్రతం రోజు  సూర్యోదయానికి ముందే లేచి ..ఇళ్లంతా శుభ్రం చేసుకొండి. ఈ మాసం అంతా శ్రీమహాలక్ష్మి నేలపై నడుస్తుందట. ఇళ్లు శుభ్రంగా ఉంచితేనే ఆరోగ్యం గా ఉంటారు. వీటిని దృష్టిలో పెట్టుకొని పూజ చేసుకొని అమ్మవారి కృపను పొందండి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sravanam pooja

Related Articles