Kurkure:సింగిల్ కుర్ కురే ..25 మందిని ఊరు వదిలిపోయేలా చేసిందంటే నమ్ముతారా!

పది మందికి పైగా గాయపడి హాస్పటిల్  జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఇంతకీ ఈ కుర్ కురే కు ...దీనికి ఏంటి సంబంధం..అసలు ఈ కుర్ కురే రచ్చేంటో తెలుసుకుందాం. 


Published Dec 25, 2024 05:06:00 PM
postImages/2024-12-25/1735126638_fightover20rupeeskurkureissue.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏంటి కుర్ కురే గొడవలు పెట్టిందా..అవును కుర్ కురే గొడవలు పెట్టడం కాదు...తల బద్దలు కొట్టుకునే వరకు వచ్చేసింది. పోనీ పోలీసులకు తెలియదా అంటే అదీ లేదు ...పోలీసులకు తెలుసు ...దాదాపు ఈ కుర్ కురే వల్ల 25 మంది ఊరు వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది కూడా. అయితే పది మందికి పైగా గాయపడి హాస్పటిల్  జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఇంతకీ ఈ కుర్ కురే కు ...దీనికి ఏంటి సంబంధం..అసలు ఈ కుర్ కురే రచ్చేంటో తెలుసుకుందాం. 


కేవలం 20 రూపాయల కుర్ కురే కోసం ఒక గ్రామంలో ఓ రేంజ్ లో యుద్ధమే జరిగింది. ఈ ఘటన దావణగెరెలోని చన్నగిరి తాలూకా హొన్నెబాగి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో ఈ రెండు ఫ్యామిలీలో మధ్య గొడవ జరగగా , ఆ గొడవ వల్ల చాలా మంది గాయాలపాలయ్యారు. కొంతమంది ఊరు వదిలి వెళ్లిపోయారు. హొన్నెబాగి గ్రామంలో అతిఫ్ ఉల్లా అనే వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. సద్దాం పిల్లలు ఇదే షాపులో కుర్ కుర్ కొన్నారు. అయితే అది కాస్త డేట్ అయిపోయింది. కాని సద్దాం వేరే ప్యాకెట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో గొడవ మొదలయ్యింది.


మర్నాడు రోడ్డు పక్కన హోటల్ పెట్టుకుని జీవిస్తున్న సద్దాం, అతిఫ్‌పై దాడికి దిగారు. టైం అయిపోయిన ప్యాకెట్స్ పిల్లలకు ఇచ్చిన కారణంగా 30 మంది సద్దాం పై దాడి చేశారు. హోటల్‌ను ధ్వంసం చేశారని కూడా సద్దాం చెబుతున్నాడు. తనపై దాడికి పాల్పడ్డవారిపై సద్దాం తిరగబడ్డాడు. చివరికి ఈ కుర్ కురే పంచాయితీ పోలీసు గడపకు చేరుకుంది. చన్నగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే దాడి చేసుకున్న వారిలో సుమారు 25 మంది తమని పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారో అనే భయంతో గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఈ గొడవలో చాలా వరకు సద్దాంకు దెబ్బలు తగిలాయి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu villages fighting karnataka

Related Articles