ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ వ్యాపారి ఇంట్లో పనిమని చేసిన గలీజ్ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పని మనిషిని పెట్టుకోవడం చాలా కామన్. ఇప్పుడు బిజీ లైఫ్ , అందరు ఎవరు పని మీద వాళ్లు వెళ్లిపోతున్నారు. ఇంట్లో పని చేయలేని వారు మరొకరి సాయం తీసుకోవడం లో తప్పులేదు. కాని నమ్మి పని ఇస్తే ఇంటి వారిని నాశనం చెయ్యడం మాత్రం తప్పు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ వ్యాపారి ఇంట్లో పనిమని చేసిన గలీజ్ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏం కోపం ఉందో ఏంటో తెలీదు కాని తనను నమ్మి ఘజియాబాద్ లోని క్రాసింగ్ రిపబ్లిక్ సొసైటీలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో పనిమనిషి దాదాపు ఎనిమిదేళ్లుగా పనిచేస్తుంది. నమ్మి పని అప్పజెబితే తన మూత్రం వేసి చపాతీ చేసి ఇంట్లో వాళ్లకి ఇస్తుందట.
ఇటీవల ఆ వ్యాపారి ఇంట్లో కుటుంబ సభ్యులు వరుసగా ఆస్పత్రి పాలవుతూ వచ్చారు. అందరికీ లివర్ ఇన్‌ఫెక్షన్ సమస్య వచ్చింది. ఎన్ని డాక్టర్లు తిప్పినా సమస్య తగ్గడం లేదట. దీంతో డాక్టర్ వంటగదిలో ఏదైనా బొద్దింకల సమస్య ఉందేమో చెక్ చెయ్యమన్నారట. రాత్రి పూట బొద్దింకలు వస్తున్నాయో లేదో చెక్ చెయ్యడానికి సీసీ కెమరా పెడితే ఈ పనిమనిషి బాగోతం బయటపడిందట.
ఆ రహస్య కెమెరాలో దృశ్యాలు చూసి సదరు వ్యాపారికి చెమటలు పట్టాడు.. వాంతులు చేసుకున్నాడు. ఎనిమిదేళ్ళుగా ఎంతో నమ్మకంగా ఉంటున్న ఆ వంట మనిషి తన మూత్రం కలిపి వంట చేయడం చూసి షాక్ తిన్నాడు. ఇక విషయం తెలిసిన వారంతా నాలుగు దెబ్బలు వేసి ...పోలీసులకు అప్పజెప్పారు. ఇంతేకాదు గతేడాది నుంచి ఇంట్లో వస్తువులు కూడా మాయమవుతున్నాయట. ఇవన్నీ చూస్తున్నా ...పనిమనిషి ని ఒక్క మాట అనలేదంటూ వ్యాపారి భార్య చాలా సీరియస్ అయ్యింది. ఏ పగ మనసులో పెట్టుకొని ఇలాంటి దారుణానికి తెగబడిందో తెలీదంటు చెప్పుకొచ్చింది బాధితురాలు .
UP के ग़ाज़ियाबाद में 8 साल से घर में काम करने वाली नौकरानी रीना पर आरोप है की वह किचन में ही बर्तन के अंदर मूत्र विसर्जन करके मूत्र में ही आटा गूंथ रोटी बनाती थी। वीडियो सामने आने के बाद नौकरानी रीना को गिरफ्तार कर लिया गया है बताया जा रहा है की पूरा परिवार कई साल से बीमार है।… pic.twitter.com/Zp8mxrzJCx — ONN18 NEWS (@newsonn18) October 16, 2024