ఆ పిల్లను బయటకు రాగానే నేలపై ఏసి కాలితో తన్నుతూ, జుట్టుపట్టుకొని కొట్టారు. రోడ్డుపై వేసి కాలితో తన్నుతూ..జుట్టు పట్టుకొని కొడుతూ చాలా దారుణంగా కొట్టారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్; సోషల్ మీడియా ..తెరిస్తే భయమేస్తుంది.నవ్వుకుంటున్నాం సరే...ఇలా భయపెట్టే సంఘటనలు కూడా తారసపడతాయి.ఈ వీడియో చూస్తే ఆడ పిల్లలేనా అని అనిపిస్తుంది. అచ్చం వీధి రౌడీల్లా ప్రవర్తించారు. స్కూల్లో ఏం జరిగిందో ఏమో...ఆ పిల్లను బయటకు రాగానే నేలపై ఏసి కాలితో తన్నుతూ, జుట్టుపట్టుకొని కొట్టారు.
వారందరూ చిన్న పిల్లలే. ఒకే స్కూల్‌కి చెందిన స్టూడెంట్స్. అయితే వీళ్లందరూ మైనర్లు. ఆ అమ్మాయి స్కూల్లో ఉన్నవారితో పొగరుగా ఉందంటు ఈ దాడికి దిగారు. ఓ విద్యార్థిని వీడియోలో కనిపిస్తున్న వారందరూ కలిసి దాడికి పాల్పడ్డారు. చేతులతో గుద్దుతూ, కాళ్లతో తన్నుతూ తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. వీళ్లలో ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. వీధి రౌడీల్లా ఇటు రా ఇటురా అంటు రోడ్డుపై వేసి కాలితో తన్నుతూ..జుట్టు పట్టుకొని కొడుతూ చాలా దారుణంగా కొట్టారు. వీడియో తీస్తున్న అమ్మాయి మాత్రం నీట్లో పడేసి కొట్టు అంటూ అరుస్తుంది. దారిన పోయే వారు కూడా ఎవ్వరు ఆపకపోవడం విచిత్రం. ఒక్క కుర్రాడు మాత్రం ఆపాడు. కాని అంతటితో ఆగలేదు. మళ్లీ కొట్టారు.
కాగా ఈ ఘటన కాస్తా పాఠశాల, తల్లిదండ్రుల దృష్టికి వెళ్లింది. దీంతో పేరెంట్స్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. పిల్లలు అందరూ మైనర్లు కావడంతో కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసినట్లు తెలుస్తోంది. పిల్లల ప్రవర్తనపై స్కూల్ యాజమాన్యం కూడా స్పందించి తీవ్రంగా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ వీడియోపై నెటిజన్లు కూడా తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు.
यारी रोड स्कूल कांड बाहेरील व्यक्ती येऊन मारत आहेत शाळेतल्या मुलींना स्कूल नेम चिल्ड्रन वेल्फेअर सेंटर..
Mumbai police kindly do take action of it is of Mumbai..@MumbaiPolice pic.twitter.com/cnjexWJ0Iy — CA Shabbir Tamboli (@SHABBIRTAMBOLI) August 24, 2024