RAVI TEJA: కొండాసురేఖ వ్యాఖ్యలను ఖండించిన రవితేజ, తేజాసజ్జా !

రాజకీయాల కోసం ఓ ఫ్యామిలీని ఇలా వాడుకోవడం చాలా దారుణమని అంటున్నారు, రీసెంట్ గా మాస్ మహారాజ్ రవితేజ తో పాటు హనుమాన్ హీరో తేజసజ్జా స్పందించారు.ఇ


Published Oct 03, 2024 07:11:53 AM
postImages/2024-10-03/1727955889_hanumanherotejasajjacrazycommentsmassheroravitejadetailsa.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : తెలంగాణ మంత్రి కొండాసురేఖ పై తెలుగు ఇండస్ట్రీ హీరోలు , హీరోయిన్లు అందరు గళమెత్తుతున్నారు. రాజకీయాల కోసం ఓ ఫ్యామిలీని ఇలా వాడుకోవడం చాలా దారుణమని అంటున్నారు, రీసెంట్ గా మాస్ మహారాజ్ రవితేజ తో పాటు హనుమాన్ హీరో తేజసజ్జా స్పందించారు.ఇది సిగ్గుచేటు అనడం కంటే కూడా దారుణమైన విషయమని రవితేజ ఘాటుగా ట్వీట్ చేశాడు. మూడు లక్షల మంది ఓట్లేస్తే గెలిచిన రాజకీయ నాయకులు.. కోట్ల మంది మెచ్చే తమపై ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటంటూ హనుమాన్ హీరో తేజ సజ్జ మరింత తీవ్రంగా స్పందించాడు. దీని వల్ల మీకు కొత్త గా ఓరిగేది ఏముంది. రాజకీయాలతో సంబంధం లేని మనుషుల్ని ఎందుకు ఇందులోకి లాగుతున్నారంటూ సీరియస్ అయ్యారు రవితేజ.


"ఓ మహిళా మంత్రి తన రాజకీయాల కోసం ఇలాంటి చిల్లర వ్యూహాలు, దిక్కుమాలిన ఆరోపణలు చేసి గౌరవనీయ వ్యక్తులను అవమానించడం చూసి నేను షాక్ తిన్నాను. సమంత ను ఇలా రోడ్డున పెట్టడం పై మీ ఉద్దేశ్యం ఏంటో అర్ధం కావడం లేదని అన్నారు.నాయకులు సమాజంలో విలువలను పెంచేలా ఉండాలి. కాని మీరు మాత్రం రాజకీయనాయకుల్లా ప్రవర్తంచడం లేదంటు కామెంట్ చేశాడు.


హనుమాన్ హీరో తేజ సజ్జ కూడా ఎక్స్ ద్వారా మరింత ఘాటుగా స్పందించాడు. మూడు లక్షల ప్రజల ఓట్లు మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా మారుస్తాయి. 10 కోట్ల మంది నమ్మకాన్ని గెలుచుకుంటే నటులు అవుతారు. ఇలాంటి మాటలతో మహిళలను అవమానించడం మరో మహిళకు తగదు. ఎన్నో సామాజిక సేవలకు ఎప్పుడు ముందే ఉండే మా పై మీకు ఎందుకు ఇంత చులకన అంటూ కామెంట్ చేశాడు  తేజ సజ్జా.విరాళాలైనా, సేవలైనా, పన్నులైనా సరే. ఇన్ని చేస్తున్నా చివరికి ప్రజలను ఆకర్షించడానికి అనవసరంగా మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. 


ఆ ముగ్గురితోపాటు అమల అక్కినేని, చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రాంగోపాల్ వర్మ, ఖుష్బూ, మంచు లక్ష్మి, విశ్వక్సేన్ లాంటి వాళ్లు కొండా సురేఖను కడిగేస్తూ ట్వీట్లు చేశారు. నాగార్జున కు ఈ విషయం చాలా కోపం తెప్పించింది. ఇలాంటి వారిని లీగల్ గా ఎదుర్కొంటానంటున్నారు నాగార్జున.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu raviteja akkineni-family tejasajja konda-surekha

Related Articles