హరీష్ రావుకు విసిరిన సవాల్ కూడా తుస్సుమనిపించింది. రుణమాఫీ చేస్తామని చెప్పి.. పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేయలేక పోయారు. దీంతో రైతులు కూడా సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
న్యూస్ లైన్ డెస్క్: నేటి నుంచే మాజీ మంత్రి, సిద్దిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు ఆలయాల యాత్రా ప్రారంభం కానుంది. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్లు వేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయం లోపు రుణమాఫీ చేయాలని.. లేదంటే సీఎం పదవి నుండి రేవంత్ తప్పుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన రేవంత్.. ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని.. ఒకవేళ చేస్తే.. రాజకీయాల నుండి హరీష్ రావు తప్పుకోవాలని, తన పదవికి రాజీనామా చేయాలని రేవంత్ సవాల్ చేశారు.
కాగా, సీఎం ఒట్లు అయితే పెట్టారు. కానీ, అటు రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోయారు. అంతేకాకుండా, హరీష్ రావుకు విసిరిన సవాల్ కూడా తుస్సుమనిపించింది. రుణమాఫీ చేస్తామని చెప్పి.. పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేయలేక పోయారు. దీంతో రైతులు కూడా సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక దేవుళ్లపై ఒట్లు పెట్టి.. మాట తప్పిన రేవంత్ రెడ్డి చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని దేవుళ్లను కోరుకుంటానని హరీష్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకే ఆయన గురువారం తన ఆలయాల యాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసం నుండి హరీష్ రావు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వెళ్లారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఉన్నారు.