Kalki 2898 AD: కల్కి మూవీకి అతి పెద్ద మైనస్ అతడే..!

భారీ తారాగణంతో తెరకెక్కిన కల్కి మూవీ ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే సినిమా చూసిన జనాలు అన్ని పాజిటివ్ రివ్యూలే ఇస్తున్నారు.తాజాగా విడుదలైన కల్కి సినిమాలో కూడా ఓ పాత్ర ఆ హీరోకి అస్సలు సెట్ అవ్వలేదట. అంతేకాదు కల్కి మూవీ అంత పెద్ద హిట్ అయినప్పటికీ  ఈ సినిమాలో ఆ హీరో ఆ పాత్రలో నటించడం మాత్రం సినిమాకి పెద్ద మైనస్ అంటూ సినిమా చూసిన జనాలు ఎక్స్ వేదికగా రివ్యూలు ఇస్తున్నారు.మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే విజయ్ దేవరకొండ.. కల్కి 2898 AD మూవీలో  విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపించారు. అయితే అర్జునుడి లుక్స్ లో విజయ్ దేవరకొండ అస్సలు బాలేడు అంటూ చాలామంది నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.క్స్ వేదికగా చాలామంది జనాలు విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్ర పై నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండపై ట్రోలింగ్ దారుణంగా జరుగుతుంది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-06-27/1719470177_vijay.jpg

న్యూస్ లైన్ డెస్క్: భారీ తారాగణంతో తెరకెక్కిన కల్కి మూవీ ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.ఇప్పటికే సినిమా చూసిన జనాలు అన్ని పాజిటివ్ రివ్యూలే ఇస్తున్నారు. అయితే ఒక సినిమాకి పాజిటివ్, నెగటివ్ రెండు రివ్యూలు ఉంటాయి.కాబట్టి సినిమా చూసిన జనాలు ఎలాంటి రివ్యూ ఇచ్చినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి.అయితే కొన్ని సినిమాల్లో కొన్ని కొన్ని పాత్రలు పోషించే నటీనటులకు అంతగా సెట్ అవ్వవు. అయితే తాజాగా విడుదలైన కల్కి సినిమాలో కూడా ఓ పాత్ర ఆ హీరోకి అస్సలు సెట్ అవ్వలేదట. అంతేకాదు కల్కి మూవీ అంత పెద్ద హిట్ అయినప్పటికీ  ఈ సినిమాలో ఆ హీరో ఆ పాత్రలో నటించడం మాత్రం సినిమాకి పెద్ద మైనస్ అంటూ సినిమా చూసిన జనాలు ఎక్స్ వేదికగా రివ్యూలు ఇస్తున్నారు.

మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే విజయ్ దేవరకొండ.. కల్కి 2898 AD మూవీలో  విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపించారు. అయితే అర్జునుడి లుక్స్ లో విజయ్ దేవరకొండ అస్సలు బాలేడు అంటూ చాలామంది నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. అంతేకాదు అసలు ఆయనకు ఆ పాత్ర సెట్ అవ్వలేదు. ఈ సినిమాలో లోని అర్జునుడి పాత్రకి విజయ్ దేవరకొండ ను తీసుకొని పెద్ద తప్పు చేశారని, ఈ మూవీకి ఇదే పెద్ద మైనస్ అంటూ నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. అసలు వీడిని సినిమాలో పెట్టాలన్న ఆలోచన డైరెక్టర్ కి ఎందుకు వచ్చిందో..సినిమా మొత్తానికి పెద్ద మైనస్ అంటూ ఒక నెటిజన్ కామెంట్ పెడితే మరో నెటిజన్ ఆ డైలాగ్ చెప్పడం ఏంట్రా తారు రోడ్డు మీద రేకు డబ్బా వేసి గీకినట్టు అంటూ పెట్టాడు.

మరో నెటిజన్ చలికి గొంతు వణుకుతున్నట్టు ఆ డైలాగ్ చెప్పడం ఏంటి అని కామెంట్ పెట్టాడు. ఇక రామ్ చరణ్ అయితే ఈ క్యారెక్టర్ లో సెట్ అయ్యేవాడు అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఇక ఓ నెటిజన్ అయితే వెరైటీగా వీడు రామబాణం వేయమంటే కామ బాణం వేస్తాడు ఏంటి వీడు అర్జునుడా.. అంటూ ఎక్స్ వేదికగా చాలామంది జనాలు విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్ర పై నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండపై ట్రోలింగ్ దారుణంగా జరుగుతుంది.

https://x.com/UberHandle/status/1806124212018348248

newsline-whatsapp-channel
Tags : prabhas kalki-2898-ad newslinetelugu nag-ashwin vijay-deverakonda arjunudu

Related Articles