Health:ఈ లక్షణాలున్న వారు ఎక్కువ కాలం బ్రతుకుతారట.!

ప్రస్తుత కాలంలో మనుషుల యొక్క ఆయు ప్రమాణం రేటు  రోజురోజుకు తగ్గిపోతుంది. దీనికి ప్రధాన కారణం మనం నివసిస్తున్నటువంటి వాతావరణం  మరియు మనం తినే ఫుడ్ అని చెప్పవచ్చు. దీనికి తోడు


Published Sep 20, 2024 07:45:00 PM
postImages/2024-09-20/1726839843_oldman.jpg

న్యూస్ లైన్ డెస్క్:ప్రస్తుత కాలంలో మనుషుల యొక్క ఆయు ప్రమాణం రేటు  రోజురోజుకు తగ్గిపోతుంది. దీనికి ప్రధాన కారణం మనం నివసిస్తున్నటువంటి వాతావరణం  మరియు మనం తినే ఫుడ్ అని చెప్పవచ్చు. దీనికి తోడు కొంతమంది డబ్బుల సంపాదన కోసం అతిగా వర్క్ చేయడం, టెన్షన్ తీసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల చాలామంది బ్రతకడానికి ఎంతో వయస్సు ఉన్నా కానీ తొందరగా మరణిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం కనీసంలో కనీసం వందేళ్ళ వరకు జీవిస్తున్నారు. మరి అలా ఎక్కువ కాలం బతికేవారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఆ వివరాలు ఏంటో చూద్దాం.

ఇప్పటికి సమాజంలో చాలామంది వృద్ధులు కనిపిస్తూ ఉంటారు. ఇందులో ఎక్కువ మంది ఎలాంటి రోగాలు లేకుండా  80 నుంచి 100 సంవత్సరాల మధ్యలో ఉంటారు. మరి వీళ్ళ యొక్క డైట్, వీరు బ్రతికిన విధానం చూస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే. అయితే మీరు ఎక్కువగా   కొవ్వులు  లేనటువంటి పండ్లు కూరగాయలు, ధాన్యాలు మాత్రమే తీసుకునే వారట. అంతేకాకుండా షుగర్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినేవారట. అంతేకాదు వీరు కెమికల్స్ లేని ఫుడ్ తినడం వల్ల అంతకాలం జీవించగలిగారు. ముఖ్యంగా జీన్ కల్మెంట్ అనే వ్యక్తి ప్రపంచంలోనే ఎక్కువ కాలం 122 సంవత్సరాలు బ్రతికారు. ఆయనలా ఎక్కువ కాలం బ్రతకాలి అంటే తప్పనిసరిగా ప్రతిరోజు వ్యాయామం చేయాలట.

అంతేకాదు  ప్రతి విషయంలో ఓవర్ గా ఆలోచించకుండా, ఎప్పుడు సంతోషంగా జీవించాలట.  అంతేకాదు ఎక్కువగా స్నేహితులతో కలిసి జీవిస్తే చాలాకాలం బ్రతుకుతారట. అంతేకాదు మోటివేషనల్ స్పీచ్ ఎక్కువగా వినాలట. ఆఫీస్ పనులైనా, బిజినెస్ పనులైనా సరే ఒత్తిడి తీసుకోకుండా క్లియర్ గా ఆలోచించుకుంటూ ముందుకెళ్లాలట. ముఖ్యంగా మానసిక ప్రశాంతతతో ప్రతిక్షణం జీవించాలని, ప్రతిరోజు తగినంత నిద్రపోవాలని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం జీవిస్తారని తెలియజేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health good-life food-habits healthy-food-habits

Related Articles