postImages/2024-07-01/1719845649_images1.jpg

UFO: అవన్నీ ఏలియన్స్..అంటున్న కెనడా దంపతులు..

2024-07-01 20:24:09

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఎందుకో ...ఎప్పుడు ఏలియన్స్ కెనడా( canada) , అమెరికా( america) ( aliance)  లాంటి దేశాల వాళ్లకే కనిపిస్తారు. లేదా వాళ్లే ఎలియన్స్ ను వెతుక్కుంటున్నారో తెలీదు కాని ...ఏలియన్స్ టాపిక్ ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. గ్రహాంతర వాసులు (ఏలియన్స్), వారు ఉపయోగించే వాహనాలు (ufo) ఇప్పటికీ మానవాళికి మిస్టరీగానే ఉన్నాయి. గతంలో  నాసాకు చెందిన పైలెట్లు కూడా తాము యూఎఫ్ఓలను గుర్తించామని చెప్పడంతో ప్రజల్లో ఆసక్తి మరింత అధికమైంది. 


కెనడాకు చెందిన జస్టిన్ స్టీవెన్సన్, డానియెల్లె డానియల్స్ స్టీవెన్సన్ దంపతులు మనిటోబాలోని ఫోర్ట్ అలెగ్జాండర్ వద్ద విన్నిపెగ్ నది సమీపంలో ప్రయాణిస్తుండగా... వారికి నదిపై దూరంగా రెండు వెలుగుతున్న అగ్నిగోళాల వంటి ఆకృతులు కనిపించడంతో, వారు ఆ దృశ్యాలను వీడియో రికార్డు చేశారు. ఇప్పుడు ఆ వాహనాలు యూఎఫ్ ఓ అని అవి ఏలియన్స్ అని చెబుతున్నారు. మాకు ఏలియన్స్ అనిపిస్తున్నాయని వీడియోలో తెలిపారు.