postImages/2024-07-01/1719843207_ash.jpg

కల్కిలో అశ్వత్థామ ఉన్న గుడి  ఏపీలోనే ఉందని మీకు తెలుసా.?

2024-07-01 19:43:27

న్యూస్ లైన్ డెస్క్: కల్కి ప్రస్తుతం రికార్డులు కొల్లగొడుతూ థియేటర్లలో దూసుకుపోతున్నది. గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేయడమే కాకుండా మరింతమంది స్టార్ నటులు ఇందులో నటించారు. అలాంటి పాన్ వరల్డ్ మూవీని దర్శకుడు నాగ్ అశ్విన్  దర్శకత్వం చేశారు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.  ఇందులో కమల్ హాసన్, అమితాబచ్చన్, విజయ్ దేవరకొండ, దీపిక పడుకొనే, దిశా పటాని, వంటి స్టార్ నటి నటులు నటించారు.

అలాగే దుల్కర్ సల్మాన్, రాజమౌళి, ఆర్జీవి, మృనాల్ ఠాకూర్ కూడా  చేశారు.  భారీ తారాగణంతో వచ్చినటువంటి ఈ సినిమా అద్భుతమైన హిట్స్ సాధించిందని చెప్పవచ్చు. అలాంటి ఈ చిత్రంలో అశ్వత్థామగా నటించిన అమితాబ్ బచ్చన్  ఒక గుడిలో తలదాచుకుంటాడు. అందులో కొన్ని వందల ఏళ్లపాటు ఉంటాడు. కల్కి పుట్టుకకు సమయం వచ్చినప్పుడు ఆ గుడి నుంచి ఆయన బయటకు వస్తాడు. ప్రస్తుతం ఆ చిత్రంలో చూపించినటువంటి గుడి ఏపీలోని నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పేరుమాల్లపాడులో  నాగేశ్వర స్వామి ఆలయమేనట.  

ఇందులోనే అశ్వత్థామ తలదాచుకున్నారని చూపించారు. కానీ ఈ చిత్రంలో ఇది కాశీలో ఉన్నట్టు చూపించారు. కానీ ఇది నిజానికి నెల్లూరులో ఉంది. పెన్నా నది తీరంలో దశాబ్దాల పాటు ఇసుక  మేటల్లో ఉండిపోయిన ఈ ఆలయం  2020లో ఇసుక తవ్వకాల్లో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ ఆలయాన్ని సినిమాలో చూపించడంతో దీన్ని చూడడానికి భక్తులు మరింత మంది వెళ్తున్నారట. దీన్ని అప్పట్లో పరశురాముడు నిర్మించాడని చరిత్ర చెబుతోంది.