postImages/2024-07-01/1719850363_PhysicalActivity.jpg

health: భారతీయుల్లో సగం మంది అన్ ఫిట్ ..

2024-07-01 21:42:43

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇఫ్పుడు ఎవరు ఫిజికల్ గా ఫిట్( physical fit) ...రాస్తున్న నేను...చదువుతున్న మీరు 90 శాతం మంది లేజీనే. కనీసం వారంలో నాలుగు రోజులు వాకింగ్ కూడా చేయడం లేదు. 18 యేళ్లు ఉన్న టీనేజర్స్ ( teeangers) లో కూడా ఓ మోస్తరు ఫిజికల్ యాక్టివిటీ లేదంటే ఆలోచించండి.


రోజులో 75 నిమిషాలు తీవ్రమైన ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అంతకంటే తగ్గితే దానిని ఫిజికల్ ఇన్ యాక్టివ్ గా పరిగణిస్తారు. దీనిని ఆధారంగా చేసుకుని 197 దేశాల్లో లాన్సెట్ సర్వే చేసింది. ఇందులో భారతీయులు మాత్రం తిన్న తిండికి తగ్గ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటున్నారు. దీని వల్లే హెల్త్ ప్రాబ్లమ్స్ తో పాటు ...కూడా ఎక్కువగా ఇండియన్స్ కే ఉన్నాయని తేల్చారు.


ఉదయాన్నే జాగింగ్.. సాయంకాలం పూట వాకింగ్( walking) .. దగ్గరి దూరాలకు కాలినడకన వెళ్లిరావడం వంటివి ఆరోగ్యకరమైన అలవాట్లు( healthy habits) . కానీ, భారతీయుల్లో చాలామంది వీటి మాటే ఎత్తడంలేదని లాన్సెట్‌ అధ్యయనం వెల్లడించింది. జాగింగ్, వాకింగ్ కాదు కదా శరీరానికి నొప్పి తెలవనివ్వడం లేదట. వారానికి 150 నిమిషాల ఓ మోస్తరు ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయట్లేదని తేల్చింది. ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు ఇవన్నీ...కాబట్టి మనం తినే రైస్ , కర్డ్ , పాలు , పెసరపప్పు, కందిపప్పు..ఇవన్నీ హైప్రోటీన్ ఫుడ్స్ , కార్బోహైడ్రేటస్ తో ఫిట్ గా ఉండేవారు. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో తినే తిండికి చేసే పనికి ...సంబంధం లేదని ...మన లేజీ జీవితాలకు ఓ పూట తిండి చాలని అభిప్రాయపడ్డారు లాన్సెట్ సర్వే వారు. ఇంత డైరక్ట్ గా చెప్పలేదు కాని ...ఫుడ్ తగ్గిస్తే ఇండియన్స్ హెల్దీగా ఉంటారని చెప్పిందన్నమాట.