Hero: యూట్యూబర్‌పై సాయి ధరమ్ తేజ్ సీరియస్..! ఎందుకంటే..?

తాజగా ఓ యూట్యూబర్‌పై సాయి ధరమ్ తేజ్ చాలా సీరియస్ అయ్యారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. హనుమాన్ అనే ఓ యూట్యూబర్.. చిన్నారుల పట్ల అసభ్యకరంగా కామెంట్లు చేస్తూ తన ఛానల్‌లో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు. గతంలో కూడా చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన ఓ వీడియోను కూడా పోస్ట్ చేశాడు. 


Published Jul 10, 2024 07:00:21 AM
postImages/2024-07-07/1720356477_modi48.jpg

న్యూస్ లైన్ సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హెల్పింగ్ నేచర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరో అయినందుకు సినిమాలకు మాత్రమే పరిమితం అవ్వకుండా.. తోటి వారికీ చేతనైన సహాయం చేస్తాడు. ఇటీవల ఓ అనాథ ఆశ్రమానికి చెందిన ఇద్దరు చిన్నారుల ట్రీట్‌మెంట్ కోసం కూడా సాయి ధరమ్ డబ్బు ఇచ్చాడు. సూర్యాపేట జిల్లాలోని చార్లెట్‌ అనాథ ఆశ్రమం నుండి ఒకరు కెమెరామెన్ ఐ ఆండ్రూకి ఫోన్ చేసి చిన్నారుల ప్రాణాలు కాపాడాలంటే డబ్బు కావాలని అడిగారట. ఆ సమయంలో తన దగ్గర డబ్బు లేకపోవడంతో ఆండ్రూ సాయి ధరమ్ తేజ్‌కు మెసెజ్ చేసి విషయం చెప్పాడు. కేవలం ఒక్క మెసెజ్‌తోనే స్పందించిన హీరో చిన్నారుల కోసం డబ్బులు పంపించారు. 

ఇలాంటి సేవాకార్యక్రమాల్లోనే కాదు, సోసిటీలో జరుగుతున్న ఎన్నో విషయాలపై సాయి ధరమ్ తేజ్ తరచుగా స్పందిస్తూనే ఉంటాడు. అయితే, తాజగా ఓ యూట్యూబర్‌పై సాయి ధరమ్ తేజ్ చాలా సీరియస్ అయ్యారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. హనుమంతు అనే ఓ యూట్యూబర్.. చిన్నారుల పట్ల అసభ్యకరంగా కామెంట్లు చేస్తూ తన ఛానల్‌లో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు. గతంలో కూడా చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన ఓ వీడియోను కూడా పోస్ట్ చేశాడు. సోషల్ మీడియా వేదికగా చిన్నారులను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఆ వీడియోను డిలీట్ చేశాడు. అయితే, ఓ తండ్రి తన మూడేళ్ల కూతురితో కలిసి తీసుకున్న వీడియోపై ఇటీవల రియాక్ట్ అయిన హనుమంతు.. తన స్నేహితులతో కలిసి అసభ్యకరంగా మాట్లాడుతూ వీడియోలు పోస్ట్ చేశాడు. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని కించపరుస్తూ.. తప్పుదోవ పట్టించే విధంగా పోస్ట్ చేసిన ఆ వీడియోపై నెటిజన్లు కూడా సీనియస్ అయ్యారు. 

ఇక తాజాగా, ఈ అంశంపై స్పందించిన సాయి ధరమ్ తేజ్.. ప్రస్తుతం సోషల్ మీడియా చాలా భయంకరంగా తయారైందని తెలిపారు. చిన్నారులతో కలిసి తీసుకున్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే తల్లిందండ్రులు ఇలాంటి మృగాలతో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఎందుకంటే తల్లిదండ్రుల బాధలు ఇలాంటి వాళ్లకి అర్ధం కావని తెలిపారు.  

ఇటువంటి అసభ్యకరమైన వీడియోలను పోస్ట్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను ట్విట్టర్‌లో ట్యాగ్ చేశారు. అయితే, సాయి ధరమ్ పోస్ట్‌పై రేవంత్ రెడ్డి, భట్టి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఇలా దుర్వినియోగం చేస్తున్న వారిపై ప్రభుత్వం తప్పక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పిల్లలకు సురక్షితమైన ఆన్‌లైన్ వాతావరణాన్ని సృష్టించడానికి కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu telanganam child police hero saidharamtej socialmedia misleading childabuse phanumantwo

Related Articles