స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం కాస్త స్లో అయిపోయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ రాంచరణ్ హీరోగా చేసిన రంగస్థలం మూవీ లో పల్లెటూరి అమ్మాయిలా చాలా బాగా యాక్ట్ చేసింది. అయితే ముందుగా ఈ సినిమాలో సమంతని హీరోయిన్ గా కొంతమంది వద్దని చెప్పారట. ఎందుకంటే ఆమెకు అప్పటికే పెళ్లయిపోయింది. ఈ హీరోయిన్ ఎందుకు అని పక్కన పెట్టేసారట. కానీ చిరంజీవి మాత్రం ఈ పాత్రకి సమంతనే కరెక్ట్ ఛాయిస్.. పెళ్లయితే ఏంటి..ఈ పాత్రకి సమంత నే తీసుకోండి అంటూ చెప్పారట. అయితే డైరెక్టర్ సుకుమార్ కూడా పల్లెటూరి అమ్మాయి పాత్రలో సమంత అసలు నటిస్తుందా.. అని అనుమానపడ్డారట.ఎందుకంటే ఈ సినిమాలో సమంత కట్టెలమోపు, బర్రెలను కడగడం వంటి సన్నివేశాలు చేయాల్సి ఉంటుంది. కానీ అందరూ అనుకున్న దానికి భిన్నంగా సమంత పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించింది అంటే సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు
న్యూస్ లైన్ డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం కాస్త స్లో అయిపోయింది.దానికి ప్రధాన కారణం ఆమె వ్యాధి అని చెప్పుకోవచ్చు. అయితే సినిమాల కోసం తన వ్యాధిని సైతం పక్కన పెడుతూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇప్పటికే ఓ పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ మరోపక్క సినిమాలను చేస్తూ వస్తుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ రాంచరణ్ హీరోగా చేసిన రంగస్థలం మూవీ లో పల్లెటూరి అమ్మాయిలా చాలా బాగా యాక్ట్ చేసింది.
అయితే ముందుగా ఈ సినిమాలో సమంతని హీరోయిన్ గా కొంతమంది వద్దని చెప్పారట.ఎందుకంటే ఆమెకు అప్పటికే పెళ్లయిపోయింది.పెళ్లయిన హీరోయిన్ ఎందుకు అని పక్కన పెట్టేసారట. కానీ చిరంజీవి మాత్రం ఈ పాత్రకి సమంతనే కరెక్ట్ ఛాయిస్.. పెళ్లయితే ఏంటి..పెళ్లయిన వాళ్ళు నటించకూడదు అని ఏమైనా రూల్ ఉందా.. ఈ పాత్రకి సమంత నే తీసుకోండి అంటూ చెప్పారట. అయితే డైరెక్టర్ సుకుమార్ కూడా పల్లెటూరి అమ్మాయి పాత్రలో సమంత అసలు నటిస్తుందా.. ఇబ్బంది పడుతుందా అని అనుమానపడ్డారట.
ఎందుకంటే ఈ సినిమాలో సమంత కట్టెలమోపు, గడ్డిమోపు ఎత్తుకోవడం, బర్రెలను కడగడం వంటి సన్నివేశాలు చేయాల్సి ఉంటుంది. ఈ పాత్రలో సమంత నటించలేదేమో అని అనుకున్నారట. కానీ అందరూ అనుకున్న దానికి భిన్నంగా సమంత పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించింది అంటే సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు