LADDU: " సజ్జ లడ్డు " .. అనీమియా కు బెస్ట్ ఆప్షన్ !

ఇవి మాత్రమే కాకుండా సజ్జలతో రుచికరమైన లడ్డూలు కూడా చేసుకోవచు. పిల్లలకి , ప్రెగ్నెంట్ లేడిస్ కు ఇది బెస్ట్ ఆప్షన్


Published Mar 08, 2025 10:52:00 PM
postImages/2025-03-08/1741454779_hq7201.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : చిరుధాన్యాల్లో సజ్జలు కూడా ఒకటి. చూడడానికి చిన్న జొన్నల్లా ఉంటాయి కాని వీటి రుచి వేరు. వీటిని నిత్యం ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి. బియ్యం , గోధుమల కన్నా సజ్జలో ఇనుము, జింకు పోషకాలు అధికంగా ఉంటాయని వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనీమియా బారిన పడకుండా ఉండవచ్చని చెబుతున్నారు.ఇక సజ్జలతో బిస్కెట్లు, కేక్‌లు, రొట్టెలు, జావ, బూరెలు, కిచిడీ, పులావ్​ వంటివి ఎన్నో చేయవచ్చు. కేవలం ఇవి మాత్రమే కాకుండా సజ్జలతో రుచికరమైన లడ్డూలు కూడా చేసుకోవచు. పిల్లలకి , ప్రెగ్నెంట్ లేడిస్ కు ఇది బెస్ట్ ఆప్షన్

.
కావాల్సిన పదార్థాలు:


సజ్జలు - 1 కప్పు


పల్లీలు - అర కప్పు


నువ్వులు - పావు కప్పు


యాలకులు - 4


ఎండు కొబ్బరి ముక్కలు - పావు కప్పు


బెల్లం తురుము - ముప్పావు కప్పు


నెయ్యి - తగినంత


ఓ గిన్నెలోకి సజ్జలు తీసుకొని నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సజ్జలు నానిన తర్వాత నీళ్లు లేకుండా వడకట్టి, ఓ క్లాత్​ మీద పరచి తేమ లేకుండా ఫ్యాన్​ గాలికి ఆరబెట్టుకోవాలి. మీరు సజ్జ లడ్డూలు చేద్దామనుకున్న ముందు రోజు మధ్యాహ్నం వీటిని నానబెట్టి ఆ రాత్రి మొత్తం ఫ్యాన్ కింద ఉంచి మరుసటి రోజు చేసుకుంటే తడి లేకుండా పూర్తిగా ఆరతాయి.


స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి సజ్జలు వేసి లో ఫ్లేమ్​లో ఫ్రై చేసుకోవాలి. అదే పాన్​లో పల్లీలు వేసి వేయించుకుని మరో ప్లేట్​లోకి తీసుకోవాలి. చివరగా కడాయిలో నువ్వులు వేసి చిటపటలాడించి మరో గిన్నెలోకి తీసుకోవాలి. మిక్సీజార్ లోకి పూర్తిగా చల్లారిన సజ్జలు , యాలకలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని  ఓ ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే జార్ లోకి ఎండు కొబ్బరి , పల్లీలు , నువ్వులు వేసి బరకగా గ్రైండ్ చేసుకొని సజ్జపిండి కలుపుకోవాలి.


సజ్జ పిండిలోకి బెల్లం తురుము వేసి పదార్థాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని మరోసారి మిక్సీజార్​లోకి తీసుకుని ముద్దగా అయ్యేంతవరకు గ్రైండ్​ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పొడిని ఓ ప్లేట్ లోకి తీసుకొని కలిపి నెయ్యి వేసుకోవాలి. నెయ్యిని బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డూలుగా వత్తుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని లడ్డూలు గా చుట్టుకుంటే ఎంతో ఆరోగ్యంకరమైన సజ్జ లడ్డూలు రెడీ. ఒకవేళ మీ దగ్గర సజ్జలు బదులు సజ్జ పిండి ఉంటే దానిని నెయ్యిలో వేయించి చేసుకుంటే సరిపోతుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu healthy-food-habits anemia laddu-

Related Articles