మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే ఇండియన్ క్రికెట్ లో దేవుడు. అలాంటి ఈయన దాదాపు 25 సంవత్సరాలకు క్రికెట్ రంగంలో రాణించి ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ఎంతో
న్యూస్ లైన్ డెస్క్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే ఇండియన్ క్రికెట్ లో దేవుడు. అలాంటి ఈయన దాదాపు 25 సంవత్సరాలకు క్రికెట్ రంగంలో రాణించి ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ఎంతో గుర్తింపు పొందారు. అలాంటి ఈ మాస్టర్ బ్లాస్టర్ టెన్త్ ఫెయిల్ అయినా కానీ క్రికెట్ పై దృష్టి పెట్టి, క్రికెట్ కె రారాజులా మారాడు. ఎన్నో అవార్డులు, రివార్డులు, రికార్డులు, ఆయన పేరు మీద ఉన్నాయి. ఇప్పటికీ ఆయనకున్న రికార్డులను చేరిపే ఆటగాడు రాలేదని చెప్పవచ్చు.
అలాంటి ఈ సచిన్ టెండూల్కర్ తన పర్సనల్ లైఫ్ విషయానికొస్తే ఆయన తన కంటే రెండు సంవత్సరాలు పెద్దదైనటువంటి అంజలిని వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు వివాహం జరిగి 30 ఏళ్లు దాటింది. ఈ తరుణంలో సచిన్ అత్త అన్నాబెల్లి మెహతా ఇటీవల రిలీజ్ చేసిన తన బుక్ లో సచిన్ గురించి రాసుకోచ్చారు. అయితే 19 సంవత్సరాల వయసులోనే సచిన్ తన కూతురుకు ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పాడట. ఈ టైం లోనే ఆయన ఇండియన్ జట్టులో ఎదుగుతున్న సమయం. దీంతో వీరి పెళ్లిని యాక్సెప్ట్ చేసిన అంజలి కుటుంబీకులు నిశ్చితార్థం చాలా సీక్రెట్ గా ఉంచారట. దీనికి ప్రధాన కారణం ఆయన అప్పుడే క్రికెట్లో ముందడుగు వేస్తున్నారు. మరి ఆయన పైకి ఎదుగుతాడా లేదంటే డీలా పడతాడా అనే అనుమానం అంజలి ఫ్యామిలీలో ఉందట.
అంతే కాదు అంజలి తల్లి అన్నాబెల్లి ప్లే బాయ్ అవుతాడని టెన్షన్ కూడా పడిందట. కానీ ఆమె అనుకున్న దానికి వ్యతిరేకంగా సచిన్ క్రికెట్ లో పెద్ద స్టార్ అయ్యారు. ఈ విషయాన్ని అన్నాబెల్లి తన జ్ఞాపకాల పుస్తకంలో రాసుకొచ్చింది. మేము అనుకున్న దానికంటే ఎక్కువగా సచిన్ కు ప్రజాదరణ వచ్చిందని ఆమె తెలియజేసింది. సచిన్ 19 ఏళ్ల వయసులో ఒక చిన్న పిల్లాడిలా ఉండేవాడని సచిన్ కంటే అంజలి కాస్త పెద్దగా ఉన్నట్లు కనిపించెదని ఆమె గుర్తు చేసుకుంది. అయితే వీరి వివాహం 1995లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే.