Maheshbabu:మహేష్ బాబు చీర కట్టి పూలు పెట్టుకొని అందంగా రెడీ..కారణం.?

తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు అంటే ఎంత గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు.  ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా బ్యాడ్ గా బిహేవ్ చేసినట్టే ఎక్కడ


Published Aug 04, 2024 08:54:29 PM
postImages/2024-08-04/1722785069_mahesh.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు అంటే ఎంత గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు.  ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా బ్యాడ్ గా బిహేవ్ చేసినట్టే ఎక్కడ కనిపించలేదు. సినిమా షూటింగ్స్,  ఫ్యామిలీ తప్ప మరో విషయం ఆయనలో కనిపించదు. అలాంటి మహేష్ బాబు  యాక్టింగ్ ను అమితంగా ప్రేమిస్తారట. నటన కోసం ఎలాంటి త్యాగం చేయడానికి అయినా సిద్ధపడతారట. ఆ పాత్ర అలా ఉంటుంది ఈ పాత్ర ఇలా ఉంటుంది నేను చేయను అని అస్సలు చెప్పారట. అలా నటనను ఇష్టపడ్డారు కాబట్టే ఆయన ఇండస్ట్రీలో అంత పెద్ద స్టార్ గా ఎదగగలిగారు.

అలాంటి సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక చిత్రంలో  నిండుగా పూలు పెట్టుకొని  తెలుగింటి ఆడపిల్లల చీర కట్టుకొని  ఆడపిల్లల పూర్తిగా తయారయ్యే సీన్లు నటించారట. ఆ సినిమా ఏంటి వివరాలు చూద్దాం.. మహేష్ బాబు చీర కట్టి పూలు పెట్టుకొని వయ్యారంగా, నడిచి వస్తున్న సీన్లో నటించారట. మహేష్ బాబు టీనేజ్ లో ఉన్నప్పుడు బాలచంద్రుడు అనే చిత్రంలో నటించారు.  

ఈ మూవీలో ఆయన ఒక సందర్భంలో పూలు పెట్టుకొని రౌడీలను అట్రాక్ట్ చేసే సీన్ ఉంటుంది. ఇందులో మహేష్ బాబును అసలు గుర్తుపట్టలేరు. ఎంతో క్యూట్ గా కనిపిస్తారు. అలా ఆ చిత్రంలో ఆయన ఆ సీన్ చేయడానికి వెనకాడకుండా నటించడంతో ఆయనకు నటనపై ఉన్నటువంటి ఆసక్తిని అప్పటి దర్శక, నిర్మాతలు గుర్తించారు. అలా మహేష్ బాబు హీరోగా ఎదిగిన తర్వాత కూడా ఇప్పటికీ దర్శకులు ఏది చెప్తే అది తప్పనిసరిగా చేస్తారట. ఇలా ఇండస్ట్రీలో ఒక కమిట్మెంట్ తో ఆయన ఉన్నారు కాబట్టే సూపర్ స్టార్ గా  పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో ఒక చిత్రం రావడానికి సిద్ధంగా ఉంది.

newsline-whatsapp-channel
Tags : mahesh-babu ss-rajamouli balachandrudu

Related Articles