JOBS: విద్యుత్​ శాఖలో 3,500 ఉద్యోగాలు - మహిళలూ అర్హులే !

ఈ ఉద్యోగాల భర్తీకి ఈ నెల నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. మహిళలు కూడా జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు అర్హులే. 


Published Oct 18, 2024 02:51:00 PM
postImages/2024-10-18/1729243343_images1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థల్లో జూనియర్ లైన్ మెన్ తో పాటు ఖాళీల పోస్టుల భర్తీకి రంగం ఫుల్ సిధ్ధం చేసింది ప్రభుత్వం. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో కలిపి 3,500 వరకు జూనియర్‌ లైన్‌మెన్‌, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు వీటి భర్తీకి ఈనెలలోనే ఉద్యోగ ప్రకటన జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి ఈ నెల నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. మహిళలు కూడా జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు అర్హులే. 


ఈ నెలలోనే జూనియర్​ లైన్‌మెన్‌, ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికెషన్​ ఇచ్చేందుకు డిస్కంలు ప్రయత్నిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకే ముందుకు వెళ్లనున్నాయి. ఎస్సీ వర్గీకరణ గురించి తేలిన తర్వాతే తదుపరి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇటివలే ఉపసంఘం వెల్లడించిన విషయం తెలిసిందే.  రాష్ట్ర ప్రుభుత్వ నిర్ణయం ఆధారంగా ఈ డిస్కంలు చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర సర్కార్​ అనుమతిస్తే ఈనెలలోనే జూనియర్​ లైన్‌మెన్‌, ఏఈ పోస్టుల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు.


ఇప్పటికే కొందరు అభ్యర్థులు సన్నద్ధమవుతుండగా నోటిఫికేషన్​ కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు మహిళలను కూడా అర్హులుగా చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ లో దాదాపు మహిళలు కూడా అప్లై చెయ్యొచ్చనేది చాలా మంచి నిర్ణయం . వచ్చే నెల విద్యుత్ శాఖలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. నిరుద్యోగులు రెడీ గా ఉంటే చాలా మంచి ప్యాకేజీతో ఉద్యోగం సాధించవచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu electricity-sector jobs

Related Articles