లిక్కర్ పాలసీ కుంభకోణంలో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన ఎమ్మెల్సీ కవిత తండ్రి కేసీఆర్ ను కలిసేందుకు బయల్దేరారు. ఎర్రవెల్లిలోని ఫామో హౌజ్ లో ఉన్న కేసీఆర్ ను కలిసేందుకు ఆమె బంజారాహిల్స్ లోని తన నివాసం నుంచి బయల్దేరారు.
న్యూస్ లైన్ డెస్క్ : లిక్కర్ పాలసీ కుంభకోణంలో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన ఎమ్మెల్సీ కవిత తండ్రి కేసీఆర్ ను కలిసేందుకు బయల్దేరారు. ఎర్రవెల్లిలోని ఫామో హౌజ్ లో ఉన్న కేసీఆర్ ను కలిసేందుకు ఆమె బంజారాహిల్స్ లోని తన నివాసం నుంచి బయల్దేరారు. దాదాపు 10 రోజుల పాటు ఎర్రవెల్లిలోనే ఉండనున్నట్టు.. పదిరోజుల పాటు కార్యకర్తలు, నాయకులు సహకరించాలని.. విశ్రాంతి కావాలని కవిత కార్యకర్తలను కోరారు. 10 రోజుల తర్వాత అందరికీ అందుబాటులో ఉంటానని ఆమె తెలిపారు.
కేసీఆర్‌ను కలవడానికి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత.
10 రోజుల పాటు ఫామ్‌హౌస్‌లోనే ఉండనున్న కల్వకుంట్ల కవిత.
పదిరోజుల తర్వాత అందరికీ అందుబాటులో ఉంటానన్న కవిత.
సహకరించాలని కార్యకర్తలు, అభిమానులకు కవిత విజ్ఞప్తి. pic.twitter.com/TtxPIljKgI — Telangana First (@TelanganaFirst_) August 29, 2024
ఐదు నెలల విరామం తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన కవిత.. భావోద్వేగానికి గురయ్యారు. తల్లి శోభమ్మను ఆత్మీయంగా హత్తుకున్న కవిత కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమెకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ త్వరలోనే మిమ్మల్ని కలుస్తానంటూ ఇంట్లోకి వెళ్లారు.