గణతంత్ర దినోత్సవరం సంధర్భంగా కేంద్రప్రభుత్వం పద్మపురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రకటించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఢిల్లీలో పద్మపురస్కారల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మపురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది.డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి పద్మవిభూషణ్ అందుకున్నారు. ఆయనతో పాటు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో మెరిశారు. బాలయ్యతో పాటు దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, మందకృష్ణ మాదిగ ,నటుడు అజిత్ , ఏపీకి చెందిన కేఎల్ క్రిష్ణ మూడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు , రాఘవేంద్రాచార్య పద్మపురస్కారాలు అందుకున్నారు.
గణతంత్ర దినోత్సవరం సంధర్భంగా కేంద్రప్రభుత్వం పద్మపురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రకటించింది. 139 మందికి ‘పద్మ’ అవార్డులు ప్రకటించింది కేంద్రం. వారిలో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.