ఈ సినిమాని మే 9 రిలీజ్ కానుంది. అయితే సమంత కు ఈ సినిమా ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: హీరోయిన్ గా మూవీస్ కు గ్యాప్ ఇచ్చిన సమంత శుభం అనే సినిమా ప్రొడ్యూస్ చేస్తుంది. సమంత ప్రొడ్యూస్ చేస్తున్న శుభం సినిమా ఫస్ట్ సినిమా . టీజర్ ఇప్పటికే రిలీజ్ చేశారు. ట్రాలాలా బ్యానర్ పై సమంత నిర్మాణంలో ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఈ శుభం సినిమా తెరకెక్కుతుంది.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో హారర్ కామెడీ సినిమాగా తెరకెక్కుతుంది. రీసెంట్ గా శుభం సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే కామెడీ హార్రర్ మిక్సప్ లో సూపర్ కాన్సప్ట్ అంటున్నారు మూవీ టీం. ఈ ట్రైలర్ చూస్తుంటే సీరియల్స్ చూసి, దయ్యాలు ఆవహించి భార్యలు భర్తల్ని కొడుతున్నట్టు, మగవాళ్ళని టార్గెట్ చేసినట్టు హారర్ కామెడీగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని మే 9 రిలీజ్ కానుంది. అయితే సమంత కు ఈ సినిమా ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.