Konda Surekha:సురేఖని మరిచిన కాంగ్రెస్.. హైలెట్ కోసమే ఆరోపణలా.?

 కాంగ్రెస్ మహిళా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మీడియాలో ఎంత దుమారం సృష్టిస్తున్నాయో చెప్పనక్కర్లేదు.. సొంత రాజకీయాల కోసం సెలబ్రిటీలపై ఈమె చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ మొత్తం


Published Oct 02, 2024 10:40:15 PM
postImages/2024-10-02/1727889015_konda12.jpg

న్యూస్ లైన్ డెస్క్:  కాంగ్రెస్ మహిళా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మీడియాలో ఎంత దుమారం సృష్టిస్తున్నాయో చెప్పనక్కర్లేదు.. సొంత రాజకీయాల కోసం సెలబ్రిటీలపై ఈమె చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ మొత్తం ధ్వజమెత్తుతోంది.   కేటీఆర్ సమంతలకి లింకు చేస్తూ సంచలన ఆరోపణలు చేసింది.. బీఆర్ఎస్ హయాంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చకుండా ఉండడం కోసం కేటీఆర్ సమంతని తన దగ్గరికి పంపించాలంటూ నాగార్జునకి చెప్పారని, దాంతో నాగార్జున ఇంటికి వెళ్లి కొడుకుని ఒప్పించి కోడల్ని కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని టార్చర్ చేశారని, ఆ టార్చర్ భరించలేకే నాగచైతన్య కి సమంత విడాకులు ఇచ్చింది అంటూ కేటీఆర్ సమంతపై సంచలన ఆరోపణ చేసింది కొండా సురేఖ..

అయితే ఈమె వ్యాఖ్యలపై నాగార్జున స్పందిస్తూ.. మీ రాజకీయాల కోసం మమ్మల్ని వాడకండి.మా వ్యక్తిగత జీవితంలోకి రాకండి.మీ మాటలని వెనక్కి తీసుకోవాలి అంటూ ఫైర్ అయ్యాడు. అలాగే సమంత కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ మీ రాజకీయాల కోసం నా పేరు ని వాడుకోకండి. నన్ను చిన్నచూపు చూడకండి. మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం అంటూ మండి పడింది. అయితే కొండా సురేఖ ఈ మాటలు మాట్లాడడానికి కారణం ఫేమస్ అవ్వడం కోసమేనని మీడియాలో ఓ రూమర్ వినిపిస్తోంది. వర్షాల కారణంగా వరంగల్, ఖమ్మంలో ఎప్పుడైతే వరదలు వచ్చాయో ఆ సమయంలో మంత్రులు ఉండి కూడా ఏమీ చేయలేదంటూ నెగిటివ్ టాక్ వచ్చింది.

దీంతో ఆ మాట మర్చిపోయి కొండా సురేఖ ఫేమస్ అవ్వడం కోసమే ఈ ఆరోపణలు చేసినట్టు కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.  వరంగల్లో కొండా సురేఖ కంటే ఎక్కువ సీతక్కకి ఫాలోయింగ్ ఉంటుంది.అలా మీడియాలో కూడా హైలెట్ గా నిలవడం కోసం కొండా సురేఖ ఈ మాటలు మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక మంత్రి సురేఖ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు హై కమాండ్ స్పందించలేదు.ఒకవేళ స్పందిస్తే రేవంత్ రెడ్డి కొండా సురేఖ పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాల్సి ఉంది.

newsline-whatsapp-channel
Tags : news-line ktr nagarjuna samantha nagachaitanya konda-surekha

Related Articles