Kushboo: 'దేవర'పై అలాంటి కామెంట్స్ చేసిన కుష్బూ..తారక్ ఫ్యాన్స్ ఏమన్నారంటే.?

దేవర మూవీ  సెప్టెంబర్ 27న రిలీజ్ థియేటర్లలో సంచలనం సృష్టించింది.  మూడు రోజులైనా కానీ హౌస్ ఫుల్ బోర్డులే  కనిపిస్తున్నాయి. అలా దేవర  రికార్డులు క్రియేట్ చేసే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే దేవరా సినిమా


Published Sep 29, 2024 09:00:12 PM
postImages/2024-09-29/1727623812_kushboo1.jpg

న్యూస్ లైన్ డెస్క్: దేవర మూవీ  సెప్టెంబర్ 27న రిలీజ్ థియేటర్లలో సంచలనం సృష్టించింది.  మూడు రోజులైనా కానీ హౌస్ ఫుల్ బోర్డులే  కనిపిస్తున్నాయి. అలా దేవర  రికార్డులు క్రియేట్ చేసే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే దేవరా సినిమా చూసిన అభిమానులంతా సంబరపడిపోతున్నారు. అంతే కాదు కొంతమంది సినీ రాజకీయ వ్యక్తులు కూడా సినిమా చూసి పాజిటివ్ టాక్ తో స్పందిస్తున్నారు.  

అయితే తాజాగా సీనియర్ నటి కుష్బూ దేవర చిత్రం చూసి ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో.. సెమ్మమాస్.. నేను దేవర చిత్రాన్ని చూడడం ఎలా మిస్ చేస్తాను..  ఈ సినిమా ద్వారా తారక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాలని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ విధంగా ఆమె సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడంతో ఆమె చేసిన ట్వీట్ కు వేలాది మంది లైక్స్ చేశారు.

ఈ విధంగా దేవర కలెక్షన్స్ విషయంలో కూడా దూసుకుపోతోంది. అంతేకాకుండా ప్రస్తుతం రాబోతున్న దసరా సెలవులు కూడా దేవర సినిమాకు మరింత కలిసి వస్తాయని, ఆ సెలవులు వస్తే ఇక ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

https://x.com/khushsundar/status/1840075109563781395?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1840075109563781395%7Ctwgr%5Ec8d6bda33fa893b8cd00e58bf621e664c4ee8daa%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftwitframe.com%2Fshow%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Fkhushsundar%2Fstatus%2F1840075109563781395

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jr-ntr devara koratala-shiva kushboo saif-ali-khan

Related Articles