లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి ) ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది సదావకాశమని చెప్పవచ్చు. అయితే ఇది ఆఫీస్ కి వెళ్లి జాబ్ చేయడం కాదట. ఇంటి వద్ద కూర్చొని జాబ్ చేసుకునే అవకాశం ఉన్నది. మరి ఆ జాబ్
న్యూస్ లైన్ డెస్క్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి ) ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది సదావకాశమని చెప్పవచ్చు. అయితే ఇది ఆఫీస్ కి వెళ్లి జాబ్ చేయడం కాదట. ఇంటి వద్ద కూర్చొని జాబ్ చేసుకునే అవకాశం ఉన్నది. మరి ఆ జాబ్ రోల్ ఏంటి? శాలరీ ఎంత వివరాలు ఏంటో చూద్దాం..
ఉద్యోగ వివరాలు:
ఎల్ఐసి లో సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయబోతున్నది. మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి. అంతేకాదు ఈ వర్క్ ను ఇంటి వద్ద కూర్చొని చేయవచ్చు. అయితే ఇంటర్ పూర్తి చేసిన స్త్రీ, పురుషులు దీనికి అర్హులు. అంతేకాకుండా మార్కెటింగ్ స్కిల్స్ కూడా అవసరం. ఈ జాబ్ కు అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 18 సంవత్సరాలు పైగానే ఉండాలి. అప్లై చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్ షార్టు లిస్టు చేసి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దీనిపై ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
జీతభత్యాలు:
ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి రూ:25 వేల నుంచి మొదలు రూ:30వేల వరకు శాలరీ ఉంటుందట. అయితే ఈ సాలరీ వారి యొక్క పనితీరు, నైపుణ్యాలు ఇంటర్వ్యూ ఆధారంగా నిర్ణయిస్తారట.
ఈ ఉద్యోగాలకు స్త్రీ, పురుషులు అనే తేడా ఏమీ లేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
స్కిల్స్: గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. తెలుగు, ఇంగ్లీష్ లో క్లియర్ గా మాట్లాడగలగాలి.