కింగ్ మేకర్ పిక్చర్స్ బ్యానర్ పై ఆసం వెంకటలక్ష్మి నిర్మాణంలో సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ఆగష్టు 2 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి ఆసం హీరోగా తెరకెక్కిన సినిమా లారి చాప్టర్ 1. ఈ సినిమాకు శ్రీకాంత్ హీరో ...డైరక్టర్ , నిర్మాత , ఫైట్ మాస్టర్ , మ్యూజిక్ డైరక్టర్ అన్న పోర్షణ్స్ తనే చేశాడు. ఈ సినిమాలో చంద్ర శిఖ హీరోయిన్. కింగ్ మేకర్ పిక్చర్స్ బ్యానర్ పై ఆసం వెంకటలక్ష్మి నిర్మాణంలో సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ఆగష్టు 2 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.
కథ విషయానికొస్తే.. రంగపట్నంలో హర్షవర్ధన్ ఆలియస్ హంటర్ రౌడీగా ఉంటాడు. తన పొట్ట కూటి కోసం గొడవలు , జైలు, దొంగ సాక్షాలు చెబుతూ బతుకుతాడు. అయితే ఓ అమ్మాయి ప్రేమలో పడి మారిపోయి లైఫ్ హ్యాపీ గా బతకాలనుకుంటాడు. అదే టైంలో మైనింగ్ అధిపతి ప్రతాప్ ముఖ్యమంత్రి అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. తన మైనింగ్ లో బయటపడిన యురేనియంని అమ్మటానికి, ఆ యురేనియంని ముంబైకి డెలివరీ చేయడానికి లారి డ్రైవర్ గా హర్షవర్ధన్ ని ఎంచుకుంటాడు. సింగిల్ టేక లో లైఫ్ మారిపోతుందనుకొని ఒప్పుకుంటాడు. ఈ పనికి భారీగా డబ్బు కూా తీసుకుంటాడు.
హర్షవర్ధన్ లారీలో యురేనియంని ముంబైకి తీసుకెళ్తుంటే చాలా మంది అడ్డుకుంటూ ఉంటారు. మరి ఆ అడ్డంకులన్నీ దాటుకొని లారిని హర్షవర్ధన్ ముంబైకి డెలివరీ చేశాడా? హర్షవర్ధన్ తండ్రి కథేంటి? హర్షవర్ధన్ ప్రేమ ఏమైంది? అతను ఎందుకు రౌడీ నుంచి మాములు మనిషిగా మారిపోయాడు తెలియాలంటే తెరపైచూడాల్సిందే.
ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా చాలా రొటీన్ కథ. కాని అన్ని విభాగాల్లో పనిచేస్తూ సినిమా తీయడంలో శ్రీకాంత్ మంచి మార్కులే కొట్టేశాడు. హీరోయిన్ చాలా బాగా అందాలు ఆరబోసింది. యాక్టింగ్ చేసే అవకాశం రాలేదు పాపం. పాటలు ఓకే ..ఫైట్స్ ఓకే సినిమా టోటల్ గా ఓకే.