12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాలో ఈ సారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వచ్చే ఏడాది జనవరిలో మహా కుంభమేళా లో భక్తుల భధ్రతకు ఏఐ ఆధారిత నిఘూ ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత యంత్రాంగం తెలిపింది. ఈ భధ్రత వల్ల ఎక్కడ ఎవరు తప్పిపోయే ఛాన్స్లేదు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాలో ఈ సారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించింది.
ఉత్తరప్రదేశ్ లో ఈ మహా కుంభమేళా 2025 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్‌లో జరగనుంది.ఈ మెగా ఈవెంట్ కోసం నగర వ్యాప్తంగా ఏఐ ఆధారిత యూనిట్లతో సహా 2,750 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమరాలు సెంట్రల్ యూనిట్ కంట్రోల్ లో ఉంటాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల మహా కుంభమేళా ఏర్పాట్లను సమీక్షించారు, దీనిలో డిసెంబర్ 15 నాటికి అన్ని పనులను పూర్తవుతాయి.
అలాగే, రియల్ టైమ్ అలర్ట్స్ ఉన్న సీసీటీవీలు రద్దీని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో 5,00,000 వాహనాలు నిలిపేలా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నారులు చనిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాదు ...దాదాపు 1950 టోల్ ఫ్రీ నెంబర్ తో ఎవరు ఎక్కడ ఎలా తప్పిపోయినా ..ఇట్టే కనిపెట్టవచ్చు. వెహికల్ ట్రాకింగ్ తో పాటు ...చిన్నారులను తప్పిపోకుండా అన్ని జాగ్రత్తలు ఏఐ సాయంతో మేనేజ్ చేస్తున్నామని తెలిపారు.