టాలీవుడ్ లో హీరో మహేష్ బాబు అంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఆయనకు లేడీ ఫాలోయింగ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇండస్ట్రీలో హీరోలు అందరూ ఒకే ఎత్తు అయితే మహేష్ బాబు ఒక విధంగా ఉంటారు. అలాంటి మహేష్ బాబు గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే.. ఆయన కేవలం తన సినిమాలు, ఫ్యామిలీ తప్ప మరో విషయంపై దృష్టి పెట్టరు. అలాంటి ఈ హ్యాండ్సమ్ హీరో తన భార్య నమ్రతాను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు రత్నాల్లాంటి పిల్లలు కూడా పుట్టారు. అలాంటి మహేష్, నమ్రతాను లవ్ చేసి వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వారి లవ్ స్టోరీ గురించి నమ్రత ఒక ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
న్యూస్ లైన్ డెస్క్: టాలీవుడ్ లో హీరో మహేష్ బాబు అంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఆయనకు లేడీ ఫాలోయింగ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇండస్ట్రీలో హీరోలు అందరూ ఒకే ఎత్తు అయితే మహేష్ బాబు ఒక విధంగా ఉంటారు. అలాంటి మహేష్ బాబు గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే.. ఆయన కేవలం తన సినిమాలు, ఫ్యామిలీ తప్ప మరో విషయంపై దృష్టి పెట్టరు. అలాంటి ఈ హ్యాండ్సమ్ హీరో తన భార్య నమ్రతాను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు రత్నాల్లాంటి పిల్లలు కూడా పుట్టారు. అలాంటి మహేష్, నమ్రతాను లవ్ చేసి వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వారి లవ్ స్టోరీ గురించి నమ్రత ఒక ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
మహేష్ బాబుతో తన ప్రేమ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదని తెలిపింది. ముందుగా వీరిమధ్య స్నేహం పుట్టిందట. తర్వాత వంశీ చిత్రంలో కలిసి నటించడం వల్ల ఆ స్నేహం మరింత బలపడిందట. సినిమా పూర్తయ్యేసరికి ఇద్దరి హవా భావాలు కలిసి మరింత దగ్గరయ్యారట. ఈ విధంగా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొని మనసులు కలిసిన తర్వాతే ప్రేమలో పడ్డారట. వారి ప్రేమను కొన్నాళ్లపాటు ఎంజాయ్ చేసిన తర్వాత విషయాన్ని ఇరు కుటుంబాలు చెప్పుకున్నారట. కానీ నాన్న కృష్ణ నమ్రతతో పెళ్లికి ఒప్పుకోలేదట. కానీ మహేష్ బాబు అక్క కృష్ణను ఒప్పించి ఇద్దరి మధ్య సెట్ చేసి, పెళ్లికి ఒప్పుకునేలా రాయబారం నడిపిందట.
చివరికి మహేష్ బాబు నమ్రతాను వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ జంట ఇండస్ట్రీలో సూపర్ జంటగానే కొనసాగుతూ వస్తోంది. అంతేకాకుండా వీరికి గౌతమ్, సీతారా ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే నమ్రత తన లవ్ స్టోరీ గురించి చెబుతూ మహేష్ బాబు క్యారెక్టర్ కూడా తెలియజేసింది. మహేష్ బాబు నన్ను ప్రతి రోజు కొత్తగానే లవ్ చేస్తారని ఆయనకు నేను, కుటుంబం తప్ప మరో లోకం తెలియదని, షూటింగ్స్ ఉన్నంతసేపు షూటింగ్లో ఉండి ఆ తర్వాత కుటుంబంతోనే గడపడానికి టైం ఇస్తారని అన్నది. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు ఎస్.ఎస్ రాజమౌళితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.