దసరా విలన్ షైన్ టామ్ చాకో అరెస్టయినట్లు తెలుస్తుంది. అయితే అతను డ్రగ్స్ తీసుకొని తనతో తప్పుగా ప్రవర్తించారని మలయాళం యాక్టర్ ఒకరు వీడియో పోస్ట్ చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఒక్క సినిమాతోనే సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. దీంతో తెలుగుతో పాటు తమిళ్ , మలయాళం భాషలలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటున్న టైంలో సడన్ షాక్ తగిలింది.
దసరా విలన్ షైన్ టామ్ చాకో అరెస్టయినట్లు తెలుస్తుంది. అయితే అతను డ్రగ్స్ తీసుకొని తనతో తప్పుగా ప్రవర్తించారని మలయాళం యాక్టర్ ఒకరు వీడియో పోస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం హోటల్ నుంచి తప్పించుకు పారిపోయిన షైన్ టామ్ చాకో దాదాపు 48 గంటల తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. షైన్ టామ్ చాకో కాల్స్ గూగుల్ పే లావాదేవీలను పరిశీలిస్తున్నారు.
అతడిపై NDPS చట్టంలోని సెక్షన్లు 27, 29 (1) కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ సెక్షన్స్ లో బెయిల్ రావడం చాలా కష్టం. దాదాపు 10 నుంచి 20 ఏళ్లు జైలు కంపల్సరీ . ఈ మధ్య ఆర్ధిక లావాదేవీల కారణంగా చాలా మంది శత్రువులు చేరారని ...హోటల్ లో కూడా తనపై ఎవరో దాడి చెయ్యబోతే పారిపోయానని ...తనకు అక్కడకి పోలీసులు వచ్చిన సంగతే తెలీదని తెలిపారు. పోలీసులు ఈ కేసుపై మరింత విచారణ జరిపిస్తున్నారు.