వినీతకు గుండ్లపోచంపల్లికి చెందిన కిరణ్‌యాదవ్‌తో వివాహం జరిగింది. భార్య భర్తలు గొడవలు పడి విడాకుల వరకు వెళ్లారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మొగుడు పెళ్లాల మధ్యకు వెళ్లకూడదని అందరూ చెప్తూనే ఉంటారు. పెద్దలు చెబుతూనే ఉంటారు...మొగుడు పెళ్లాలు మధ్య వెళ్తే అవమానమే మిగులుతుందని ..అయినా గొడవలు పెరుగుతున్నాయని మధ్యలోకి వెళ్తుంటాం. అలా మధ్యలో వెళ్లిన వ్యక్తిని భర్త చంపేంత పనిచేశాడు అసలు కథేంటి అంటే ...
హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన అనీషా, వినీత అక్కాచెల్లెళ్లు. వినీతకు గుండ్లపోచంపల్లికి చెందిన కిరణ్‌యాదవ్‌తో వివాహం జరిగింది. భార్య భర్తలు గొడవలు పడి విడాకుల వరకు వెళ్లారు. మళ్లీ భార్య ఏమనుకుందో కలిసి బతుకుదామని ..తనను తన భర్త దగ్గరకు వెళ్లడానికి సాయం చెయ్యాలని తన సోదరి అనీషాకు చెప్పింది. అయితే తన భర్తకు వీళ్లకు తెలిసిన తరుణ్ అనే వ్యక్తిని పంపి మాట్లాడించారు.
అక్కడ ఏం జరిగిందో ఏమో...గత నెల 26న గుండ్లపోచంపల్లిలోని కిరణ్ ఇంటికి వెళ్లిన తరుణ్ అతడితో మాట్లాడే ప్రయత్నం చేశాడు. తరుణ్‌ను చూడగానే కోపంతో ఊగిపోయిన కిరణ్.. తన వద్దకు ఎందుకు వచ్చావంటూ స్నేహితులు బోయిన్‌పల్లికి చెందిన జయంత్‌యాదవ్, సుచిత్రకు చెందిన సోహెల్, అంగడిపేటకు చెందిన తరుణ్‌గౌడ్, గుండ్లపోచంపల్లికి చెందిన పవన్‌లతో కలసి అతడిపై దాడిచేశాడు.
కత్తులతో పొడిచి ...బట్టలు విప్పించి కులం పేరుతో దూషిస్తూ అతనితో కాళ్లు నాకించుకున్నాడు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకొని తరుణ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. కోలుకున్న తర్వాత ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.దీంతో నిందితులు పరారీ లో ఉన్నారు.