హేమా కమిటీ రిపోర్ట్‌ని స్వాగతిస్తున్నామని, దీనికి బాధ్యులైన వారందరినీ నిందించలేమని తెలిపారు. జూనియర్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిశీలిస్తున్నామని, విచారణ ప్రక్రియకు సహకరిస్తామని ఆయన తెలియజేశారు.
న్యూస్ లైన్, సినిమా: మలయాళ చిత్రపరిశ్రమను జస్టిస్ హేమ కమిటీ నివేదిక కుదిపేస్తోంది. తాజగా, ఈ అంశంపై లైంగిక వేధింపుల ఆరోపణలపై నటుడు మోహన్‌లాల్ స్పందించారు. ఈ వ్యవహారంలో కేవలం అమ్మను (Association of Malayalam Movie Artists)ను లక్ష్యంగా చేసుకోవద్దని ఆయన అభ్యర్థించారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో దయచేసి పరిశ్రమను నాశనం చేయవద్దని కోరారు. హేమా కమిటీ రిపోర్ట్‌ని స్వాగతిస్తున్నామని, దీనికి బాధ్యులైన వారందరినీ నిందించలేమని తెలిపారు. జూనియర్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిశీలిస్తున్నామని, విచారణ ప్రక్రియకు సహకరిస్తామని ఆయన తెలియజేశారు.
ఈ విషయాలను సరి చేయడానికి అందరూ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తన అలాంటి పవర్ గ్రూప్ గురించి తెలియదని, తను అందులో భాగం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక ఆయన హేమా కమిటీ నివేదికను చదవలేదని, ప్రభుత్వం ఈ నివేదికను విడుదల చేయాలని కోరుతున్నట్టు మోహన్ లాల్ పేర్కొన్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే అమ్మ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాపై పలువురు నటుల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి.