మమ్ముట్టి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న మోహన్ లాల్ మార్చి 18న శబరిమలలో ఉష పూజలో పాల్గొన్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ శబరిమలలో మమ్ముట్టి కోసం పూజ చేయడం కాంట్రవర్సీ అయ్యింది. మమ్ముట్టి ఒక ముస్లిం ..మోహన్ లాల్ ఒక హిందు..ముస్లిం వ్యక్తి పేరు మీద పూజ చేయించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. హిందూ దేవాలయంలో పూజ చేయడం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మార్చి రెండోవారంలో ముమ్ముట్టి అస్వస్థతకు గురైనట్లు వార్తలొచ్చాయి.
మమ్ముట్టి , మోహన్ లాల్ మధ్య చాలా మంచి స్నేహం ఉంది. అందుకే మమ్ముట్టి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న మోహన్ లాల్ మార్చి 18న శబరిమలలో ఉష పూజలో పాల్గొన్నారు. ముమ్ముట్టి అసలు పేరు ముహమ్మెద్ కుట్టి. ఆయన జన్మ నక్షత్రం వైశాఖం. ఆ వివరాలనే మోహన్ లాల్ ఆలయంలో పూజారికి ఒక నోట్‌పై రాసిచ్చి ముహమ్మెద్ కుట్టి పేరుపై పూజ చేయించారు. అయితే ఈ పూజలు చేయించడంపై కొందరు ఫైర్ అవుతున్నారు.