NTR Japan Fans : ఎన్టీఆర్ కోసం తెలుగు నేర్చున్న జపాన్ అభిమాని !

ఒక అమ్మాయి అయితే ఎన్టీఆర్ కోసం తెలుగు నేర్చుకున్నాను అని తెలుగు నేర్చుకుంటున్న ఓ బుక్ కూడా చూపించింది. ఆ బుక్ పై ఆటోగ్రాఫ్ తీసుకుంది


Published Mar 27, 2025 05:17:00 PM
postImages/2025-03-27/1743076131_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మన తెలుగు హీరోలకు తెలుగు సినిమాలకు రీసెంట్ గా కొన్నాళ్ల నుంచి జపాన్ లో ఫుల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ అంటే చాలు జపాన్ వాళ్లు ఫుల్ క్రేజీ అయిపోతున్నారు.గత నాలుగురోజులుగా దేవర సినిమా ప్రమోషన్స్ గట్టిగా జరుగుతున్నాయి. మార్చి 28 న రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ తో స్టెప్పులు వేశారు. ఎన్టీఆర్ ని చూడటానికి ఎగబడ్డారు. ఎన్టీఆర్ తో ఫొటోలు , ఆటోగ్రాఫ్స్ తీసుకోవడానికి కూడా జపాన్ లో ఎన్టీఆర్ లేడీ అభిమానులు ఎగబడ్డారు.


ఒక అమ్మాయి అయితే ఎన్టీఆర్ కోసం తెలుగు నేర్చుకున్నాను అని తెలుగు నేర్చుకుంటున్న ఓ బుక్ కూడా చూపించింది. ఆ బుక్ పై ఆటోగ్రాఫ్ తీసుకుంది. RRR చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను అని చెప్పింది. ఒక సినిమా , భాషా ప్రేమికుడిగా సినిమా భాషలకు , కల్చర్ కు ఒక వారధిలా నిలబడి ఓ కొత్త బాష నేర్చుకున్నారంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇండియన్ సినిమాని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది కూడా ఒక రీజన్. అంటూ పోస్ట్ ను ఈ వీడియోను పోస్ట్ చేశారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jr-ntr movie-news

Related Articles