ఈ విషయం ఆయనను కలిసి చెప్పగా, కాసేపు ముచ్చటించిన తర్వాత అదే రోజు సాయంత్రం చేద్దామని అన్నారని విజయ్ తెలిపారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఎన్టీఆర్ ఇండస్ట్రీలో చాలా కూల్. చాలా సరదా మనిషి అయితే ఎన్టీఆర్ ను అంతకు ముందు ఎక్కువ సార్లు కలవలేదని విజయ్ దేవరకొండ అన్నారు. విజయ్ హీరోగా ...డైరక్టర్ గౌతమ్ తిన్న సూరి తెరకెక్కిస్తున్న " కింగ్ డమ్ " టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. రీసెంట్ గా ఈ టీజర్ ను రిలీజ్ చేయగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ చాలా ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పాడు.
.
టీజర్ కోసం వాయిస్ ఓవర్ రాసే సమయంలో ఎన్టీఆర్ అన్నతో చెప్పిస్తే బాగుంటుందని అనుకున్నాం ...ఈ విషయం ఆయనను కలిసి చెప్పగా, కాసేపు ముచ్చటించిన తర్వాత అదే రోజు సాయంత్రం చేద్దామని అన్నారని విజయ్ తెలిపారు. డైరక్టర్ చెన్నైలో ఉన్నారని టీజర్ కు సంబంధించిన మ్యూజిక్ వర్క్ లో బిజీ గా ఉన్నారని చెప్పగా" ఏం పర్లేదు నువ్వు ఉన్నావ్ గా అంటూ ఎన్టీఆర్ అనడం తనకు చాలా హ్యాపీ గా అనిపించిందని అన్నారు. తన వాయిస్ టీజర్ ను తన స్టోరీని మరింత స్ట్రాంగ్ చేసిందని తెలిపారు.