ఈ నెల 25న ఆమె మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన 11 మంది సెలబ్రేటీలు , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. చాలా మంది సెలబ్రటీలు పోలీసులు నోటీసులు అందించారు. నోటీసులు అందుకున్న విష్ణుప్రియ ఈ నెల 20న పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యింది, ఈ నెల 25న ఆమె మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంది.
ఈ క్రమంలో తనపై నమోదైన రెండు ఎఫ్ ఐఆర్ లను క్యాష్ చెయ్యాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో విష్ణుప్రియ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజు ఆమె కేసు కొట్టేయాలనే పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు విచారణ జరిపి ఎఫ్ ఐఆర్ లను కొట్టి వేసేందుకు నిరాకరించింది. విచారణలో పోలీసులకు సహకరించాలని ఆమెను ఆదేశించింది. చట్టప్రకారం విష్ణుప్రియను విచారించాలని పోలీసులుకు ఆదేశాలు ఇచ్చింది. అయితే విష్ణు ప్రియను విచారించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసులో విష్ణుప్రియ బెట్టింగ్ యాప్స్ నుంచి నిమిషానికి లక్ష రూపాయిలు తీసుకున్నట్లు తెలిపింది.