స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు శనివారం కూంబింగ్ నిర్వహించారు. ఈ టైంలో మావోయిస్టులు కాల్పులకు దిగారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఛత్తీస్ గఢ్ లోని మరోసారి భారీ మావోస్టులకు , భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందిరు. వీరితో పాటు ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.16 మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు శనివారం కూంబింగ్ నిర్వహించారు. ఈ టైంలో మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు 16 మంది హతమార్చారు. కెర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు , పోలీస్ ఫోర్స్ బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు తెలిపారు. రెండు వర్గాలు మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రెండు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.